IND vs SL T20I Series: శ్రీలంకతో టి20 సిరీస్, వన్డే సిరీస్‌లకి జట్లు ఖరారు.. హార్థిక్కి కెప్టేన్సీ
IND vs SL T20I Series, ODI Series: ఊహించినట్టుగానే శ్రీలంకతో జరగబోయే టి20 సిరీస్‌కి టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యకు కెప్టేన్‌గా వ్యవహరించే ఛాన్స్ వచ్చింది. అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ కి సైతం బిసిసిఐ భారత తుది జట్టును ప్రకటించింది.
IND vs SL T20I Series, ODI Series: శ్రీలంకతో జరగనున్న టి20 సిరీస్ కి బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య టీమిండియాకు క్యాప్టెన్సీ చేయనుండగా.. సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టేన్ గా వ్యవహరించనున్నాడు. జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ లో మొత్తం మూడు మ్యాచులు జరగనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లతో పాటు కేఎస్ రాహుల్ లాంటి ఆటగాళ్లకు టి20 సిరీస్ నుంచి రెస్ట్ కల్పించారు. ఐపిఎల్ 2022 లో సత్తా చాటుకున్న శివం మావి, ముఖేష్ కుమార్ వంటి ఆటగాళ్లకు శ్రీలంకతో పోటీపడబోయే టి20 జట్టులో చోటు దక్కింది.
అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ కి సైతం బిసిసిఐ భారత తుది జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ లో భారత జట్టుకు రోహిత్ శర్మ నేతృత్వం వహించనుండగా.. హార్ధిక్ పాండ్య ఈ సిరీస్ లో వైస్ కెప్టేన్ గా వ్యవహరించనున్నాడు. ఇక్కడ గమనించదగిన మరో విషయం ఏంటంటే.. రిషబ్ పంత్ కి అటు టి20 జట్టులో చోటు దక్కలేదు ఇటు వన్డే సిరీస్ లోనూ అవకాశం రాలేదు. దీంతో అతడిని మొత్తానికే డ్రాప్ చేశారా ? లేక రెస్ట్ ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీకి కూడా వన్డే సిరీస్‌లో ఛాన్స్ ఇచ్చారు.
శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వెంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లకు శ్రీలంకపై తలపడే టి20 సిరీస్, వన్డే సిరీస్ రెండు జట్లలోనూ చోటుదక్కింది.
ఇది కూడా చదవండి : David Warner Double Century: డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ.. తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు!
ఇది కూడా చదవండి : IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ రేసులో ఉన్నదెవరు, ఎవరికి ఛాన్స్
ఇది కూడా చదవండి : India New T20 Captain: శ్రీలంక సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 జట్టుకు కొత్త కెప్టెన్! రోహిత్ ఉన్నా అతడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook