IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ రేసులో ఉన్నదెవరు, ఎవరికి ఛాన్స్

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 కోసం అంతా సిద్ధమైపోయింది. వేలం పూర్తవడంతో ఏ జట్టుకు ఎవరో తేలిపోయింది. ఇంకా కొన్ని జట్ల కెప్టెన్లు ఎవరనేది తేలాల్సి ఉంది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 26, 2022, 10:27 PM IST
IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ రేసులో ఉన్నదెవరు, ఎవరికి  ఛాన్స్

ఐపీఎల్ 2023 సీజన్ 16 కోసం 10 ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. కొచ్చిలో డిసెంబర్ 23 వేలంతో ఆటగాళ్లు వివిధ జట్లకు ఎలాట్ అయిపోయారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త ఆటగాళ్లతో సిద్ధమైనా..ఇంకా కెప్టెన్ ఎవరనేది తేలాల్సి ఉంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వేలం కంటే ముందు 12 మంది ఆటగాళ్లనే రిటైన్ చేసుకుంది. కొత్తగా 13 మందిని వేలంలో కొనుగోలు చేసింది. ఇందులో హ్యారీ బ్రూక్స్, మయాంక్ అగర్వాల్, ఆదిల్ రషీద్, వివ్రాంత్ వ్యాస్ శర్మలకు భారీగా చెల్లించి కొనుగోలు చేసింది. టీమ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వదులుకోవడంతో కొత్త కెప్టెన్ ఎన్నుకోవల్సిన అవసరమొచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ రేసులో 3-4 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఎవరికి కెప్టెన్సీ వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. 

మయాంక్ అగర్వాల్

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్‌గా ఉన్న మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. 2022 సీజన్‌లో పంజాబ్ జట్టుకు 7 విజయాలు అందించాడు. ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ రేసులో ఉన్నాడు.

మార్క్‌రమ్

ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాడు మార్క్‌రమ్. దక్షిణాఫ్రికా అండర్ 19కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ కాగల అర్హతలున్నాయి.

హ్యారీ బ్రూక్

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి చాలా పోటీ పడి 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. కచ్చితంగా ఇతను కూడా ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీ రేసులో ఉండే అవకాశాలున్నాయి.

భువనేశ్వర్ కుమార్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న భువనేశ్వర్ కుమార్ టీమ్ ఇండియాలో టాప్ పేసర్‌గా ఉన్నాడు. 7 మ్యాచ్‌లలో ఎస్‌ఆర్‌‌హెచ్ జట్టుకు గతంలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి నాయకత్వ పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ టీమ్

మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్క్‌రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఆకిల్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్ధ్ వ్యాస్, వివ్రాంత్ వ్యాస్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిక్ క్లాసెన్, మార్క్ జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజలుల్ హక్ ఫరూఖి

Also read: India New T20 Captain: శ్రీలంక సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌! రోహిత్ ఉన్నా అతడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News