IPL 2022 New Rules: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 కోసం బీసీసీఐ కొత్త నియమావళి రూపొందించింది. బీసీసీఐ రూపొందించిన కొత్త నియమావళి వివాదాస్పదంగా మారుతోంది. ఆటగాళ్లే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ కొత్త నియమావళి వివాదాస్పదంగా మారుతోంది. మార్చ్ 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 కోసం బీసీసీఐ కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఈసారి ఐపీఎల్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. బీసీసీఐ రూపొందించిన కొత్త నియమావళి కారణంగా పోటీ మరింత రసవత్తరం కానుంది. కొత్త నిబంధనలతో రెండు జట్లకు ప్రయోజనం చేకూరనుండగా..మరికొన్ని నిబంధనలతో ఒక్క జట్టుకే లాభం కలగనుంది. న్యూజిలాండ్‌కు చెంది ఓ ఆల్‌రౌండర్ కొత్త నియమాలపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా..వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశాడు. 


వాస్తవానికి మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ చేసిన కొన్ని నియమాల ప్రభావం ఐపీఎల్‌పై పడింది. ఒకవేళ ఎవరైనా బ్యాటర్..క్యాచవుట్ అయినప్పుడు ఇద్దరూ ఒకరికొకరు క్రాస్ అయినా సరే..కొత్తగా వచ్చే బ్యాట్స్‌మెన్ స్ట్రైక్‌పై ఉంటాడు. ఈ కొత్త నిబంధనపై న్యూజిలాండ్‌కు చెందిన జేమ్స్ నీశమ్ అభ్యంతరం తెలిపాడు. బహిరంగంగానే కొత్త నిబంధనను వ్యతిరేకించాడు. నాకిప్పటి వరకూ ఈ కొత్త నిబంధన ఎందుకు తెచ్చారో అర్ధం కాలేదు..ఎవరికైనా ఎప్పుడైనా పాత నిబంధనతో ఇబ్బంది ఎదురైందా, బీసీసీఐ చేసిన ఈ మార్పువల్ల మ్యాచ్ పరిస్థితి అంచనా వేయలేని బ్యాట్స్‌మెన్లకే ఇబ్బంది వస్తుందని..నాకైతే అస్సలు నచ్చలేదు అంటూ ట్వీట్ చేశాడు.


ఐపీఎల్ 2022లో జేమ్స్ నీశమ్..రాజస్థాన్ రాయల్స్ తరపున అడనున్నాడు. నీశమ్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.50 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఐపీఎల్‌లో ఈ క్రీడాకారుడు ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. నీశమ్ ఇప్పటివరకూ ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ టీమ్‌ల తరపున ఆడాడు. ఇప్పటివరకూ ఇతడు..12 మ్యాచ్‌లు ఆడి కేవలం 61 పరుగులే సాధించాడు. 8 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 15లో రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మార్చ్ 29న పూణేలో ఆడనుంది. 


డీఆర్ఎస్‌లో మార్పులు


ఐపీఎల్ డీఆర్ఎస్ విషయంలో కూడా మరో మార్పు చేసింది. కొత్త నియమం ప్రకారం..ప్రత్యేక పరిస్థితుల్లో డీఆర్ఎస్ సంఖ్యను 1 నుంచి 2కు పెంచింది. దీనివల్ల ప్రతి జట్టు రెండుసార్లు నిర్ణయాన్ని సమీక్షించవచ్చు. గతంలో ఈ సమీక్ష ఒకసారే ఉండేది. ఇప్పుడు ప్రతి టీమ్‌కు బ్యాటింగ్‌లో రెండుసార్లు, ఫీల్డింగ్‌లో రెండు సార్లు అవకాశముంటుంది. 


ప్లే ఆఫ్ లేదా ఫైనల్‌కు కొత్త నిబంధన


ఐపీఎల్ 2022లో మరో కొత్త నిబంధన రానుంది. ఈసారి ప్లే ఆఫ్ లేదా ఫైనల్ మ్యాచ్‌లో టై అయిన తరువాత నిర్ణీత సమయంలో సూపర్ ఓవర్ తరువాత మరో సూపర్ ఓవ‌ర్‌‌తో నిర్ణయం కాకపోతే..లీగ్ స్టేజ్‌లో ఆ రెండు జట్ల ఆట తీరును పరిశీలిస్తారు. లీగ్ దశలో ఏ టీమ్ అగ్రస్థానంలో ఉందో ఆ టీమ్‌ను విజేతగా నిర్ణయిస్తారు. ఈ కొత్త నిబంధన వల్ల లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించేందుకు అన్ని జట్లు కచ్చితంగా ప్రయత్నాలు చేస్తాయి.


Also read; Harmanpreet Kaur: వావ్.. వాట్ ఏ క్యాచ్ హర్మన్‌ప్రీత్! బహుశా జాంటీ రోడ్స్ కూడా పట్టడేమో (వీడియో)!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook