BCCI about Mohammed Shami, India vs Pakistan match: ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో భాగంగా భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలవడాన్ని జీర్ణించుకోలేకపోయిన భారత క్రికెట్ ప్రియులు కొంతమంది సోషల్ మీడియా వేదికగా టీమిండియా బౌలర్ మొహమ్మద్ షమిపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసి ట్రోల్ చేసిన (Trolls on Mohammed Shami) విషయం తెలిసిందే. టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ఆన్‌లైన్ ఎటాక్‌ని ఖండిస్తూ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్ వంటి క్రికెట్ దిగ్గజాలు అతడికి అండగా నిలిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి సైతం మొహమ్మద్ షమికి మద్దతు పలుకుతూ (Asaduddin Owaisi supports Mohammed Shami) నెటిజెన్స్‌పై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. 11 మంది ఆటగాళ్లు ఉన్న జట్టు ఓటమికి కేవలం మొహమ్మద్ షమినే బాధ్యుడిని చేస్తూ ట్రోల్ చేయడం వెనుక ఉన్న కారణం అతడు ముస్లిం కావడమేనా అని అసదుద్దీన్ ఒవైసి ప్రశ్నించారు. మొహమ్మద్ షమిపై వస్తున్న ట్రోల్స్‌ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సర్కారు ఖండించగలదా అని అసదుద్దీన్ ఒవైసి నిలదీశారు. 


మొహమ్మద్ షమీ (Mohammed Shami bowling against Pakistan) 3.5 ఓవర్లలో 11.20 ఎకానమీ రేటుతో ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా 43 పరుగులు ఇవ్వడమే అతడిపై నెటిజెన్స్ తమ ఆగ్రహం వెళ్లగక్కడానికి కారణమైంది. ఈ విషయంలో మొహమ్మద్ షమికి పలువురు క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది కానీ బీసీసీఐ మాత్రం వెంటనే స్పందించలేదు. దీంతో షమికి అండగా నిలిచిన పలువురు ప్రముఖులు, నెటిజెన్స్ బీసీసీఐపై సైతం విమర్శలకు దిగారు. 



 


దీంతో ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించిన బీసీసీఐ (BCCI).. మొహమ్మద్ షమికి అండగా నిలుస్తున్నట్టు ప్రకటించింది. విరాట్ కోహ్లీతో (Virat Kohli) షమి కలిసి ఉన్న ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన బీసీసీఐ.. దేశం గర్వపడుతోందని, మరింత దృఢంగా ముందుకు సాగాల్సిందిగా సూచిస్తూ ఓ ట్వీట్ చేసింది.