BCCI Lifts ban On Ankeet Chavan: ఒక్కోసారి అనాలోచితంగానో, ఆవేశంగానో తీసుకున్న నిర్ణయం జీవితాలను తలకిందులు చేస్తాయి. కొందరు క్రికెటర్లు డబ్బుకు ఆశపడి పక్కదారి పట్టడం వల్ల కెరీర్ కోల్పోయారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL Spot Fixing) కేసులో చిక్కుకున్న క్రికెటర్లు 7 ఏళ్లకు పైగా క్రికెట్‌కు దూరమయ్యారు. తద్వారా కెరీర్ నాశనం చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL Spot Fixing) స్పాట్ ఫిక్సింగ్ అభియోగాలు ఎదుర్కొన్న ముంబై మాజీ ఆల్ రౌండర్ క్రికెటర్ అంకిత్ చవాన్‌ (BCCI lifts ban on Ankeet Chavan)కు భారీ ఊరట లభించింది. అతడిపై విధించిన నిషేధాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎత్తివేసింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అంకిత్ చవాన్‌ను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు అనుమతించింది. దీంతో తనకు క్రికెట్ ఆడేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని ముంబై మాజీ క్రికెటర్ చవాన్ పీటీఐ మీడియాకు వెల్లడించాడు. బీసీసీఐ నుంచి తనకు క్లియరెన్స్ ఇస్తూ మంగళవారం సాయంత్రం మెయిల్ వచ్చినట్లు తెలిపాడు.


Also Read: Team India For WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపికైన భారత ఆటగాళ్లు


ఐపీఎల్ 2013లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం రేపింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అంకిత్ చవాన్, టీమిండియా పేసర్ శ్రీశాంత్(Sreesanth), చండిలాలు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం విధించగా, ఫిక్సింగ్‌కు సంబంధించిన విచారణ ముగియడం, అతడి పాత్రపై స్పష్టత వచ్చినా జీవితకాల నిషేదాన్ని ఏడేళ్లకి పరిమితం చేసింది బీసీసీఐ. గత ఏడాది సెప్టెంబర్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్ శ్రీశాంత్‌పై నిషేధం ముగియడంతో దేశవాలీ టోర్నీలలో ప్రాతినిథ్యం వహించాడు.


Also Read: WTC Final: టీమిండియా బౌలర్‌ Ravichandran Ashwinపై పాకిస్తాన్ బౌలర్ సంచలన ఆరోపణలు


శ్రీశాంత్‌పై నిషేధం ముగిసినా, గత ఏడాది సెప్టెంబర్ నుంచి తనకు క్లియరెన్స్ కోసం అంకిత్ చవాన్ ఎదురుచూశాడు. ముంబై బోర్డు నుంచి సైతం బీసీసీఐకి లేఖలు రాపించి తన వంతు ప్రయత్నాలు చేశాడు. ఎట్టకేలకు నిషేధం ముగియడంతో బీసీసీఐ అంకిత్ చవాన్‌ను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇచ్చింది. 26 టీ20లాడిన చవాన్ 633 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 19 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 4/29.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook