BCCI Roger Binny: భారత క్రికెట్లో ఆ రెండు పనులు పూర్తిచేయాల్సిన బాధ్యత నాపై ఉంది: బీసీసీఐ నయా బాస్ రోజర్ బిన్నీ
BCCI New President Roger Binny react about injuries and pitches. పూర్తి బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత క్రికెట్లో ఆ రెండు విషయాలపైనే దృష్టి పెడతా అని బీసీసీఐ నయా బాస్ రోజర్ బిన్నీ తెలిపారు.
BCCI New President Roger Binny react about injuries and pitches: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ ఎంపికయ్యారు. మంగళవారం ముంబైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ ఎన్నికైనట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ లేకపోవడంతో.. బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో రెండో దఫా బీసీసీఐ బాస్ కావాలని ఆశించిన భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి నిరాశే ఎదురైంది.
బీసీసీఐ అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముందుగా తాను ఏం చేయబోతున్నారో రోజర్ బిన్నీ మీడియాతో చెప్పారు. 'బీసీసీఐ అధ్యక్షుడిగా రెండు విషయాలపై ముందుగా దృష్టి పెట్టాలనుకుంటున్నా. మొదటిది భారత ఆటగాళ్ల గాయాలు. ప్లేయర్స్ తరచుగా గాయపడటం ఆందోళన కలిగిస్తుంది. ఆటగాళ్లకు గాయాలను తగ్గించడానికి ఏమి చేయాలో ఆలోచిస్తాం. నేషనల్ క్రికెట్ అకాడమీలో మాకు అద్భుతమైన వైద్యులు మరియు శిక్షకులు ఉన్నారు. గాయాలను తగ్గించడానికి అందరం పాటుపడతాం' అని బిన్నీ చెప్పారు.
'టీ20 ప్రపంచకప్ 2022కు ముందు జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. ఇది భారత జట్టు ప్రణాళికపై తీవ్ర ప్రభావం చూపింది. అందుకే ముందుగా ప్లేయర్స్ గాయాలపై దృష్టి సారిస్తాం. ఇక రెండోది.. దేశంలోని పిచ్‌ల మీద దృష్టాసారిస్తా. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ప్లేయర్స్ ఇబ్బందిపడకూడదు. ఆస్ట్రేలియాలో మాదిరి ఎక్కువ పేస్ మరియు బౌన్స్ రాబట్టే పిచ్‌లు మనకు అవసరం' అని బీసీసీఐ నయా బాస్ రోజర్ బిన్నీ పేర్కొన్నారు. 1983 వరల్డ్ కప్ విన్నర్ బిన్నీ చెప్పినట్టు ఈ రెండు సమస్యలు తీరితే.. భారత్ మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంది.
Also Read: ఆ వీడియో తీసినందుకు.. ఇద్దరు యువకులను 4 గంటలు చితకబాదిన ఆసుపత్రి నర్సులు!
Also Read: తగ్గిన బంగారం ధర.. ఏకంగా రూ. 3900 తగ్గిన వెండి! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook