Ganguly replaces Kumble as Chairman of ICC Cricket Committee:  బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ(Sourav Ganguly).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన టీమ్ ఇండియా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే(Anil Kumble) పదవీ కాలం ముగియనుండటంతో ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2012 నుంచి కుంబ్లే క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవిలో కొనసాగుతున్నాడు. ఇప్పటికే మూడు పర్యాయాలు పదవి కాలం పూర్తి కావడంతో ఐసీసీ నిబంధనల(ICC Rules) ప్రకారం ఆ పదవి నుంచి తప్పుకోనున్నాడు. భారత విజయవంతమైన కెప్టెన్‌ లలో దాదా ఒకడు. అంతేకాక అత్యుత్తమ బ్యాట్స్ మెన్. గంగూలీ 2015, 2019 మధ్య బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశాడు. 2019 అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడి (BCCI president)గా బాధ్యతలు స్వీకరించాడు.


Also Read: ‘ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ఇండియాను పాకిస్తాన్ పంపిస్తారా?’.. కేంద్రమంత్రి అనురాగ్ స్పందన


‘ఐసీసీ పురుషుల  క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టడాన్ని ఆహ్వానిస్తున్నాం. దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన సౌరభ్‌ సేవలను మేం ఉపయోగించుకుంటాం. బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం కూడా మాకు కలిసొస్తుంది. అలాగే, ఇన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలను పెంచేందుకు కృషి చేసిన అనిల్ కుంబ్లే సేవలు మరువలేనివి. డీఆర్ఎస్ విధానం సరిగా అమలయ్యేలా చూడటం, అనుమానాస్పద బౌలింగ్‌ శైలిలపై సరైన నిర్ణయం తీసుకోవడం వంటి విషయాలపై కుంబ్లే కీలకంగా వ్యవహరించాడు’ అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే  (Barclay) పేర్కొన్నాడు.


అప్గాన్ క్రికెట్ పై చర్చ
అలాగే అఫ్ఘానిస్తాన్లో తాలిబన్ల పాలన(Taliban Rule) నేపథ్యంలో ఐసీసీ(ICC) కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్ఘాన్​ క్రికెట్ బోర్డు(Afghan Cricket Board) కార్యాచరణను సమీక్షించేందుకు ఓ వర్కింగ్ గ్రూప్​ను ఏర్పాటు చేసింది. వర్కింగ్ గ్రూప్లో ఇమ్రాన్ ఖ్వాజా ఛైర్మన్‎గా రాస్ మెక్​కలమ్, లాసన్ నైడో, రమీజ్ రాజాను గ్రూప్​ సభ్యులుగా నియమించింది. మరికొన్ని కొద్ది రోజుల్లో ఈ గ్రూప్ నివేదికను సమర్పించనుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook