భారత క్రికెట్‌లో బెస్ట్ ఓపెనింగ్ జోడీలలో సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ ద్వయం ఒకటి. అయితే సచిన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ గంగూలీ (Sourav Ganguly) వెల్లడించాడు. దాదా ఓపెన్స్ విత్ మయాంక్ పేరిట సోషల్ మీడియాలో వీడియో చాట్ చేశాడు. ఈ క్రమంలో యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్.. సచిన్ (Sachin Tendulkar)‌కు సంబంధించి ఓ ప్రశ్నను గంగూలీకి సంధించాడు. సచిన్‌కు బౌలింగ్ చేయడం అంత సులువు కాదు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్డేల్లో తొలి బంతిని సచిన్ ఎదుర్కోకపోవడానికి, స్ట్రైకింగ్ ఎందుకు తీసుకోడని గంగూలీని ప్రశ్నించాడు. ఇందుకు గంగూలీ రెండు కారణాలు తెలిపాడు. ఫామ్‌లో ఉన్నప్పుడు నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్నా, అది అలాగే కొనసాగుతుందని సచిన్ భావిస్తాడు. ఒకవేళ ఫామ్‌లో లేకున్నప్పుడు నాన్ స్ట్రైకింగ్ తీసుకుంటే తనపై ఒత్తిడిని తగ్గించుకుని ఆడేందుకు వీలుంటుందని సచిన్ గతంలో తనకు చెప్పినట్లు గంగూలీ తాజాగా వెల్లడించాడు.  భారత్‌ దెబ్బకు వెన‌క్కి త‌గ్గిన చైనా


ఒకవేళ అవతలి బ్యాట్స్‌మెన్ సచిన్ కన్నా వేగంగా మైదానంలోకి వెళ్లి నాన్ స్ట్రైకింగ్‌లో నిలుచుంటే తప్పా.. మనం సచిన్‌ను తొలి బంతి ఆడేలా చేయలేమన్నాడు. తన కెరీర్‌లో కేవలం ఒకట్రెండు సందర్భాలలో అలా చేశానన్నాడు. గంగూలీ, సచిన్ ద్వయం 136 ఇన్నింగ్స్‌లలో ఓపెనింగ్ ఆడి 6,609 పరుగులు సాధించారు. ఓవరాల్‌గా వీరిద్దరూ ఓపెనర్లుగా 176 ఇన్నింగ్స్‌లు ఆడి 8,227 పరుగులు చేశారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos