భారత్ ఎదురుతిరిగితే ఎలా ఉంటుందో చైనాకు డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్‌తో చైనాకు రుచి చూపించింది. చైనాకు చెందిన 59 యాప్స్‌పై భారత్‌లో నిషేధం విధించడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించడంతో కంగుతిన్న చైనా ఎట్టకేలకు తలొగ్గింది. లఢాఖ్‌లోని గల్వాన్ లోయ సరిహద్దు వద్ద చైనా బలగాలు 1.5 కి.మీ మేర వెనక్కి వెళ్లిపోయాయి. PM Modi meets soldiers: జవాన్ల ధైర్య సాహసాలను మెచ్చుకున్న ప్రధాని మోదీ..
చైనా బలగాలను సోమవారం గాల్వన్, గోగ్రా, హాట్ స్పింగ్స్ కేంద్రాల నుంచి వారి ప్రభుత్వం వెనక్కి రప్పించింది. సరిహద్దు వద్ద సైనికుల గుడారాలను, ఇతర నిర్మాణాలను కూడా చైనా తొలగించినట్లు అధికారిక వర్గాల సమాచారం. మూడు రౌండ్లలో కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశాల అనంతరం చైనా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. భారత్ తమ ఎదురుదాడి చర్యలో భాగంగా ఆ దేశానికి చెందిన 59 యాప్స్‌ను నిషేధించి చైనాను ఆర్థికంగా దెబ్బకొడుతోంది. ఒక్క Tik Tokతోనే చైనాకు వంద కోట్ల నష్టం
ఇదే ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద జూన్ 15న చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. చైనా సైనికులు రాడ్లు, రాళ్లు, ఇతరత్రా ఆయుధాలతో గాల్వన్ లోయలో ఆ దురాగతానికి పాల్పడ్డారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos