టీమిండియాకు దూకుడు నేర్పిన ‘దాదా’ సౌరవ్ గంగూలీ
Sourav Ganguly Birthday | 1990 దశకం చివర్లో, 2000 దశకంలో క్రికెట్ చూసిన ప్రతి ఒక్కరికీ గంగూలీ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాడిగా కంటే కెప్టెన్‌గా కూడా గంగూలీ తనదైన ముద్రవేశాడు. నేడు ‘కింగ్ ఆఫ్ ఆఫ్‌సైడ్’ సౌరవ్ గంగూలీ జన్మదినం.
సౌరవ్ గంగూలీ.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు దాదా. 1990 దశకం చివర్లో, 2000 దశకంలో క్రికెట్ చూసిన ప్రతి ఒక్కరికీ గంగూలీ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాడిగా కంటే కెప్టెన్‌గా కూడా గంగూలీ తనదైన ముద్రవేశాడు. నేడు ‘కింగ్ ఆఫ్ ఆఫ్‌సైడ్’ సౌరవ్ గంగూలీ జన్మదినం (Sourav Ganguly Birthday). జులై8న 48వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Happy birthday Sourav Ganguly).
రాయల్ బెంగాల్ టైగర్, ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా అంటూ గంగూలీకి ఎన్నో వ్యవహారిక పేర్లున్నాయి. భారత క్రికెట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుపోయిన సమయంలో కెప్టెన్సీకి ఎవరు ముందుకు రాని గడ్డుకాలంలో నేనున్నానంటూ భరోసానిస్తూ బాధ్యతలు అందుకుని సక్రమంగా నిర్వహించిన ధీశాలి. పొరపాటున ఫిక్సింగ్ లాంటివి చేయాలని గంగూలీని కలిసేందుకు బుకీలు సైతం భయపడతారంటే ఆటపట్ల అతడి అంకితభావం అలాంటిది. నాయకత్వానికి దూకుడు నేర్పిన వ్యక్తి గంగూలీ. సచిన్ స్ట్రైకింగ్ ఎందుకు తీసుకోడు.. సీక్రెట్ చెప్పిన గంగూలీ
ప్రతిభావంతులను అందించిన కెప్టెన్
మ్యాచ్ విన్నర్లు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోనీలాంటి గొప్ప క్రికెటర్లకు అవకాశం ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు Sourav Ganguly. చిన్న జట్లపై కూడా ఓటమి పాలవుతున్న జట్టుకు విదేశాల్లోనూ భారత్ విజయకేతనం ఎగురవేయలగలదని నిరూపించిన కెప్టెన్ అతడు. గంగూలీ కెప్టెన్సీలో 146 వన్డేలు ఆడిన భారత్ 76 మ్యాచ్‌లలో గెలిచి, 65 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. మరో 5 మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్
టెస్టుల్లో 49 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన గంగూలీ 21 మ్యాచ్‌లలో విజయపథంలో నడిపించాడు. 13 మ్యాచ్‌లు ఓడగా, 15 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అంతగా అనుభవం లేని కుర్రాళ్లతో కూడిన జట్టును 2003లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చి టీమిండియాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియా జట్టును ఢీకొనే జట్టు లేకపోవడంతో భారత్ సైతం ఫైనల్లో చతికిల పడింది. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణకు ఆదేశం
వన్డేల్లో తొలి 300 భాగస్వామ్యం
1999 వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్(145)తో కలిసి గంగూలీ(183) రెండో వికెట్‌కు 300 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కాగా, వన్డేల్లో ఏ వికెట్‌కైనా తొలి 300 భాగస్వామ్యం ఇదే.
311 వన్డేలాడిన గంగూలీ 22 శతకాలు, 72 అర్ధశతకాల సాయంతో 11,363 పరుగులు సాధించాడు. 100 వన్డే వికెట్లను సైతం దాదా తన ఖాతాలో వేసుకున్నాడు. 113 టెస్టులాడిన గంగూలీ 16 శతకాలతో 7212 పరుగులు చేశాడు. అరంగేట్ర టెస్టులోనే శతకం బాదడం గమనార్హం. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos