India vs England: నేటి నుంచి క్రికెట్ పండుగ మొదలుకానుంది. జూనియర్ భారత జట్టు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడనుండగా..సీనియర్ టీమ్‌ ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఇవాళ రాత్రి 9 గంటలకు హార్ధిక్ పాండ్య నేతృత్వంలోని టీమిండియా..ఐర్లాండ్‌ను ఢీకొట్టనుంది. జూనియర్‌ టీమ్‌కు వీవీఎస్ లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటు రోహిత్ కెప్టెన్సీలోని భారత సీనియర్ టీమ్ జూలై 1న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లీష్‌ టీమ్‌తో తలపడనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలోనే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బర్మింగహమ్ వేదికగా ఈమ్యాచ్‌ జరుగుతుంది. భారత అభిమానుల కోరిక మేరకు మ్యాచ్‌ను అరగంట ముందు ప్రారంభించాలని నిర్ణయించారు. మొదట ఈమ్యాచ్‌ను భారత కాలామాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో మ్యాచ్‌ ముగిసే సమయానికి రాత్రి 11 దాటిపోతుంది. చాలా మంది మ్యాచ్‌ను చూసే అవకాశం ఉండదు.


దీంతో మ్యాచ్‌ సమయాన్ని అరగంట ముందుకు ప్రారంభించాలని ఈసీబీ నిర్ణయించింది. జూలై 1న మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్‌ ప్రారంభమై రాత్రి 10 గంటలకు లేదా 10.30 గంటలకు వరకు జరుగుతుంది. ఐదు రోజులపాటు జరిగే టెస్ట్ మ్యాచ్‌లో ప్రతి రోజూ 90 ఓవర్ల ఆట జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకైక టెస్ట్ మ్యాచ్‌ ముగిసిన తర్వాత మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది.


జూలై 7న తొలి టీ20, 9న రెండో టీ20, 10న మూడో మ్యాచ్‌ జరగనుంది. టీ20 మ్యాచ్‌ల తర్వాత జూలై 12న వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. జూలై 12న మొదటి వన్డే, 14,17 తేదీల్లో రెండో, మూడో మ్యాచ్‌ జరుగుతుంది. మరోవైపు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా రావడంతో గందరగోళం నెలకొంది. మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఎవరూ మ్యాచ్‌ను నడిపిస్తారన్న దానిపై క్లారిటీ లేదు.


Also read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..వాతావరణ శాఖ ఏం చెబుతోంది..!


Also read: Tirumla Temple: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌..రేపే అందుబాటులోకి ఆర్జిత సేవా టికెట్లు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.