ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ బౌలింగ్‌లో చాలా ఇబ్బంది పడ్డానని భారత స్టార్ క్రికెటర్, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ డెల్ స్టెయిన్‌ బౌలింగ్‌ను జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోవద్దని భావించానని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.  స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘2007లో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటించాను. అయితే బ్రెట్‌ లీ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తే నాకు నిద్రకూడా పట్టలేదు. గంటకు 150కి.మీ వేగంతో బ్రెట్ లీ సంధించే బంతులను ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందాను. నాలాంటి యువకుడు 150- 155కి.మీ వేగంతో వచ్చే బంతులు ఎలా ఆడాలన్న దానిపై ఫోకస్ చేశానని’ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వెల్లడించాడు. భార్యను బెదిరించబోతే ప్రాణం పోయింది


జీవితంలో ఇద్దరి బౌలింగ్‌ను ఎదుర్కోవద్దని భావించాను. ఒకరు ఆసీస్ పేసర్ బ్రెట్ లీ కాగా, మరో బౌలర్ దక్షిణాఫ్రికా బౌలర్ డెల్ స్టెయిన్. సఫారీ పేసర్ బౌలింగ్‌లో స్వింగ్‌తో పాటు పేస్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. దీంతో స్టెయిన్ బౌలింగ్‌ అంటే కూడా నాకు నిద్రపట్టేది కాదు. ఆసీస్ మరో పేసర్ జోష్ హజెల్ వుడ్ బౌలింగ్ లైన్ అండ్ లెంగ్త్ సరిగ్గా ఉంటుంది. టెస్ట్ క్రికెట్‌లో ప్రస్తుతం ఆడవద్దు అనుకుంటున్న బౌలర్ జోష్ హజెల్ వుడ్. నటి పూజా ఝవేరి లేటెస్ట్ ఫోటోస్


హజెల్ వుడ్ క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తాడు.  అతడు అసలు చెత్త బంతులు వేసి బ్యాట్స్‌మెన్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వడు. అతడి బౌలింగ్ వీడియోలు చూసి ఎలా బ్యాటింగ్ చేయాలో అర్థం చేసుకున్న. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో హజెల్ వుడ్‌ను ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు రోహిత్ తెలిపాడు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా! 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!