Pak Vs Aus: లాహోర్ కి తరలించనున్న ఆసీస్ Vs పాక్ వన్డే & T-20 మ్యాచ్‌లు..??.. కారణం..?
పాకిస్తాన్ లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు ఆసీస్- పాక్ మధ్య జరగనున్న సీరీస్ పై ప్రభావం చూపేలా ఉంది. మార్చ్ 29 నుండి జరగనున్న వన్డే సిరీస్ లాహోర్ కు తరలించే ఆలోచనలో పాక్ క్రికెట్ బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది.
Pakistan Vs Australia: దాయాది దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఆస్ట్రేలియా- పాకిస్తాన్ వన్డే సిరీస్ పై ఎఫెక్ట్ చూపుతున్నాయి. ఈ నెల 29 నుంచి జరగాల్సిన వన్డే సిరీస్ వేదికపై అనుమానాలు నెలకొన్నాయి. షెడ్యూల్ ప్రకారం రావాల్పిండి వేదికగానే జరగాల్సిన వన్డే, టీట్వంటీ మ్యాచ్‌లను.. లాహోర్ కు తరలించే ఆలోచనలో పాక్ క్రికెట్ బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ పదవికి గండం ఏర్పడింది. ప్రతిపక్షాలు ఇమ్రాన్ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ జాతీయ అసెంబ్లీలో అంటే పార్లమెంటు దిగువ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై ఈ నెల చివర్లో ఓటింగ్ జరగనుంది. 28 నుంచి 30వ తేదీ మధ్య ఓటింగ్ ఉండొచ్చని తెలుస్తోంది.
24 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తోంది. పాక్ తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీట్వంటీ మ్యాచ్ ఆడేందుకు ఫిబ్రవరి 27 పాక్ లో ల్యాండ్ అయ్యారు. కంగారూల టీంకు పాక్ ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కల్పిస్తోంది. ఇప్పటికే జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లు కూడా డ్రా ముగిసాయి. ఈ నెల 21 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత క్రికెటర్లు మార్చి 26న రావాల్పిండికి బయలుదేరనున్నారు.
ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో రావాల్పిండి, ఇస్లామాబాద్ లో పొలిటికల్ హీట్ పెరిగింది.ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా ఈ నెల 27న ఇస్లామాబాద్ లో పది లక్షల మందితో ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలు జరిగే ప్రదేశం క్రికెటర్లు బస చేసే హోటల్ కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పీడీఎం పార్టీ కూడా ఈ నెల 23 భారీ ర్యాలీలు తీయాలని ఆ పార్టీ కేడర్ కు పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలోనే వన్డే సిరీస్ వేదికపై సందిగ్ధత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం మూడు వన్డేలు, ఒక టీట్వంటీ మ్యాచ్ కూడా రావాల్పిండి వేదికగానే జరగాల్సి ఉంది. రావాల్పిండి వేదికను లహోర్ కు మార్చే ఆలోచనల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రతినిధులతో బోర్డు చర్చలు జరుపుతోంది. ఈ నెల 29న తొలి వన్డే జరగనుంది. మరి పొలిటికల్ హీట్ పెరిగిన నేపథ్‌యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Also Read: South Korea Covid Cases: దేశంలో కరోనా కలవరం.. ఒక్కరోజే 6 లక్షల కరోనా కేసులు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook