South Korea Covid Cases: దేశంలో కరోనా కలవరం.. ఒక్కరోజే 6 లక్షల కరోనా కేసులు నమోదు!

South Korea Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గడం వల్ల పలు దేశాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. మరోవైపు చైనా, దక్షిణ కొరియా దేశాల్లో మాత్రం కొవిడ్ ఆంక్షలు తీవ్రతరం అవుతున్నాయి. కరోనా కేసులు క్రమంగా పెరగడమే అందుకు కారణంగా కనిపిస్తుంది. దక్షిణ కొరియాలో ఒక్కరోజే 6 లక్షల కరోనా కేసులు నమోదవ్వడం వల్ల అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 01:11 PM IST
South Korea Covid Cases: దేశంలో కరోనా కలవరం.. ఒక్కరోజే 6 లక్షల కరోనా కేసులు నమోదు!

South Korea Covid Cases: కరోనా సంక్షోభం మొదలైన తర్వాత తొలిసారి దక్షిణ కొరియాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. నెల రోజుల నుంచి ఆ దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

గురువారం ఒక్కరోజే 6 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవ్వడం వల్ల అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కరోనా ప్రారంభం నుంచి ఇంతటి కరోనా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. 

గడిచిన 24 గంటల్లో దక్షిణ కొరియా వ్యాప్తంగా కొత్తగా 6,21,328 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. బుధవారంతో పోలిస్తే గురువారం నమోదైన కరోనా కేసుల్లో 55 శాతం పెరగడం గమనార్హం. అయితే ప్రస్తుతం దేశంలో 82 లక్షలకు కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనా ధాటికి దక్షిణ కొరియా వ్యాప్తంగా 429 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే కరోనా సంక్షోభం తర్వాత ఇంతటి కరోనా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.  

ALso Read: China Corona Cases: దేశంలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు.. భయం గుప్పిట్లో చైనా ప్రజలు!

Also Read: Russian Model Murdered: పుతిన్ పై విమర్శలు చేసిన రష్యన్ మోడల్ మృతి.. సూటుకేసులో మృతదేహం లభ్యం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News