Chennai Super Kings batter Ambati Rayudu announces retirement for IPL: చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ప్లేయర్, తెలుగు తేజం అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 15వ సీజన్ అనంతరం  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)కు గుడ్‌బై చెబుతున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. రాయుడు అకస్మాత్తుగా రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఐపీఎల్ 2022 నుంచి ఇప్పటికే నిష్క్రమించిన బాధలో ఉన్న చెన్నై జట్టుకు ఇది మరో ఎదురుదెబ్బ అని చెప్పాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఇది నా చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. 13 సంవత్సరాలుగా ఈ మెగా టోర్నీతో నా అనుబంధం కొనసాగింది. రెండు గొప్ప జట్లలో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను. అద్భుతమైన అనుభూతిని పొందా. ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు కృతజ్ఞతలు' అని అంబటి రాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఇక్కడే తెలుగు తేజం అసలు ట్విస్ట్ ఇచ్చాడు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు చేసిన ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేశాడు.


అయితే అప్పటికే అంబటి రాయుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాయుడు రిటైర్మెంట్‌ ట్వీట్‌ను డిలీట్ చేయడంతో.. అతడు మళ్లీ ఐపీఎల్‌లో కొనసాగబోతున్నాననే సందేశాన్ని ఇచ్చినట్టే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తన ఐపీఎల్ జర్నీని వచ్చే సీజన్‌లో కూడా కంటిన్యూ చేస్తాడని చాలా మంది ట్వీట్స్ చేస్తున్నారు. 2019 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కనందుకు అంతర్జాతీయ ఆటకు రిటైర్మెంట్‌ పలికిన రాయుడు.. అదే ఏడాదిలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. 


అంబటి రాయుడు ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 271 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 78 కాగా.. స్ట్రైక్ రేట్‌ 124.31గా ఉంది. ఇక 2010 సీజన్‌లో ఐపీఎల్  టోర్నమెంట్‌లో అడుగు పెట్టిన రాయుడు ఇప్పటివరకు 187 మ్యాచ్‌లు ఆడి 4187 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 100.  ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడాడు. 


Also Read: Chandrababu Naidu: కుప్పం పర్యటనలో జూ.ఎన్టీఆర్ అభిమానిపై ఫైర్ అయిన చంద్రబాబు నాయుడు..?


Also Read: Virat Kohli: ఓరి దేవుడా.. నేను ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు! విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook