Virat Kohli: ఓరి దేవుడా.. నేను ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు! విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్

RCB vs PBKS, Virat Kohli reaction goes viral after he out. థర్డ్ అంపైర్ ఔటవ్వడంపై విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆకాశం వైపు చూస్తూ.. తన నిరాశను దేవుడిపై చూపించాడు. ఆపై గట్టిగా అరుస్తూ పెవిలియన్ చేరుకున్నాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 01:50 PM IST
  • ఔట్ కాదని చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నా
  • ఓరి దేవుడా.. నేను ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు
  • విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్
Virat Kohli: ఓరి దేవుడా.. నేను ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు! విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్

Virat Kohli reaction goes viral after he got out in RCB vs PBKS match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేని విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. మళ్లీ తడబడుతున్నాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 20 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో కోహ్లీ చెలరేగుతాడునుకుంటే.. మరోసారి నిరాశపరిచాడు. పంజాబ్ పేసర్ కగిసో రబడా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. 

నాలుగో ఓవర్‌ రెండో బంతిని కగిసో రబడా షార్ట్ పిచ్‌గా వేయగా.. విరాట్ కోహ్లీ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే కోహ్లీ షాట్ ఆడడంలో తడబడంతో బంతి అతని డొక్కలో తాకి గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న రాహుల్ చాహర్ బంతిని అందుకుని సంబరాలు చేసుకున్నాడు. పంజాబ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ నిర్ణయం కోరాడు. కోహ్లీ మాత్రం తాను ఔట్ కాదని చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. కానీ రిప్లేలో బంతి గ్లోవ్స్‌ను తాకినట్టు తేలింది. దాంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. 

థర్డ్ అంపైర్ ఔటవ్వడంపై విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆకాశం వైపు చూస్తూ.. తన నిరాశను దేవుడిపై చూపించాడు. ఆపై గట్టిగా అరుస్తూ పెవిలియన్ చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 'ఓరి దేవుడా.. నేను ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు', 'ఓ దేవుడా.. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది' అంటూ కోహ్లీ బాధపడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ పరిస్థితులు ఏ మాత్రం కలిసి రావడం లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 

విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2022లో ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడి 236 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ముందంజ వేసేందుకు చేరువైన స్థితిలో భారీ పరాజయంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే బెంగళూరు ఆశలు సజీవంగా ఉంటాయి. మరి ఈ మ్యాచులో అయినా కోహ్లీ చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

Also Read: Rajat Patidar Six: రజత్ పాటిదార్ భారీ సిక్స్.. ముసలి అభిమాని గుండు ఢమాల్ (వీడియో)!

Also Read: Summer Drinks: ఎండాకాలంలో తీసుకోవాల్సిన జ్యూస్‌లు, వీటిని తయారుచేసుకోవడం చాలా ఈజీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

Trending News