చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) కీలక నిర్ణయం తీసుకుంది. సురేష్ రైనా, హర్భజన్ సింగ్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకునే ప్రక్రియను మొదలు పెట్టింది. తమ అధికారి వెబ్ సైట్ నుంచి ఈ ఇద్దరు ఆటగాళ్ల పేర్లను తొలగించడమే కాకుండా కాంట్రాక్ట్ ను టెర్మినేట్ చేసేందుకు చర్యలు తీసుకుంది చైన్నై టీమ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ ఆక్షన్ రూల్స్ 2018 ప్రకారం హర్భజన్, రైనా ఇద్దరూ మూడు సంవత్సరాల పాటు ఐపీఎల్ లో చెన్నై తరపున ఆడనున్నట్టు అగ్రీమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఐపీఎల్ 2020 (IPL 2020)  వారికి చివరి సీజన్. అయితే లీగ్ లో ఆడటానికి వారు నిరాకరించారు. దాంతో వారిద్దరి కాంట్రాక్ట్ రద్దు చేయడానికి టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడటానికి రైనా ( Suresh Raina ) 11 కోట్లు, హర్భజన్ ( Harbhajan Singh) 2 కోట్ల అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ సీజన్ లో వారు ఆడకపోవడంతో ఈ ఏడాది వారికి భారీగా పారితోషికంలో కటింగ్ జరగనుంది.



ALSO READ | Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు.. 


ఈ విషయంపై స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్..కాంట్రాక్ట్ రద్దు ప్రక్రియ మొదలు అయినట్టు తెలిపారు. దాంతో పాటు ఆడితే డబ్బులు ఇవ్వాలని రూల్ ఉంది. ఆడకపోతే ఇవ్వడం ఎందుకు అన్నారు. ఈ కాంట్రాక్ట్ రద్దు అయితే ఇకపై చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రైనా, భజ్జీ ఆడలేరు. వచ్చే ఏడాది (IPL 2021)  ఆక్షన్ జరగకపోతే మళ్లీ ఆక్షన్ వరకు వారు ఖాళీగా ఉండాల్సిందే.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR