CSK Sketch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మెగా ఆక్షన్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. బెంగళూరు వేదికగా జరగనున్న వేలంపాటలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంపికపై ధోనీ స్కెచ్ ఎలా ఉండనుంది. ఈసారి వర్కవుట్ అవుతుందా లేదా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ మరి కాస్సేపట్లో బెంగళూరులో ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు పేరుందనే విషయం అందరికీ తెలిసిందే. ఏకంగా ఐపీఎఎల్ టైటీల్ నాలుగు సార్లు గెల్చిన జట్టు. ఈ ఘనత అంతా జట్టు సారధి ఎంఎస్ ధోనీదే. జట్టు ప్రయోజనాల కోసం సరైన కఠిన నిర్ణయాలు తీసుకోవడం, త్యాగం చేసేందుకు కూడా సిద్ధం కావడం అతడి ప్రత్యేకత. ఐపీఎల్ 2022 రిటెన్షన్‌కు ముందు తన స్థానాన్ని రవీంద్ర జడేజా కోసం త్యాగం చేయడమే దీనికి నిదర్శనం. 


ఎందుకంటే రిటెన్షన్ విషయంలో సీఎస్కే జట్టు ధోనీకు అత్యధికంగా 16 కోట్లు చెల్లించేందుకు, రెండవ స్థానంలో రవీంద్ర జడేజాకు 12 కోట్లు చెల్లించేందుకు సిద్దమైంది. కానీ రవీంద్ర జడేజా అవసరాన్ని గుర్తించి తన స్థానంలో జడేజాను తీసుకునేలా చేశాడు. ఫలితంగా జడేజాకు 16 కోట్లు, తనకు 12 కోట్లు దక్కుతున్నాయి. ఇక మూడవ స్థానంలో మొయిన్ అలీ 8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ 6 కోట్లతో రిటైన్ అయ్యారు. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు యాజమాన్యానికి కూడా ధోనీ నిర్ణయంపై మంచి గురి ఉంది. ఎందుకంటే ఎప్పుడూ నిరాశపర్చలేదు. అత్యుత్తమ జట్టునే ధోనీ ఎంపిక చేస్తాడనే అభిప్రాయం ఆ జట్టు యాజమాన్యానికి ఉంది. ఈసారి కూడా ఆక్షన్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికల్ని సిద్ధం చేశాడు.


ప్రస్తుతం సీఎస్కే(CSK) వద్ద వేలంలో ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కేవలం 48 కోట్లే మిగిలాయి. ఈసారి సీఎస్కే జట్టు క్వింటన్ డి కాక్, శార్ధూల్ ఠాకూర్, రోవ్‌మన్ పావెల్, రాజ్ అంగద్ బావా, దీపక్ చాహర్ కోసం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. డి కాక్‌కు 4 కోట్లు చెల్లించేందుకు, రోవ్‌మన్ పావెల్‌కు కోటి రూపాయలు, శార్ధూల్ ఠాకూర్‌కు 4 కోట్లు, రాజ్ అంగద్ బావాకు 50 లక్షలు, దీపక్ చాహర్‌కు 3 కోట్లు చెల్లించేందుకు సీఎస్కే సిద్ధంగా ఉందని సమాచారం. మరి ఈసారి ధోనీ స్కెచ్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.


Also read : IPL Mega Auction 2022: మరి కాస్సేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్, వేలంపాటలో ఆటగాళ్లెవరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook