నాగ్పూర్ లో టీమిండియా-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సెంచరీల మోత మోగించింది. విజయ్, కోహ్లీ, పుజారా సెంచరీలు బాదడంతో జట్టు అత్యధిక స్కోర్ కు చేరుకుంది. లంచ్ విరామ సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 127 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. దీనితో భారత్ 199 పరుగుల ఆధిక్యంలో ఉంది. జట్టు స్కోర్ 399 వద్ద దాదాపు రోజున్నరపైగా బ్యాటింగ్ చేస్తున్న పుజారా శనక బౌలింగ్ లో బౌల్డయ్యాడు. విరాట్ కోహ్లీ, రహానే ప్రస్తుతం క్రీజులో  ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. టెస్టుల్లో 14 సెంచరీలు పూర్తిచేసిన చటేశ్వర్ పుజారా అరుదైన రికార్డ్ సాధించాడు. భారత గడ్డ మీద వేగంగా 3000 పరుగులు సాధించిన భారత బ్యాట్స్ మెన్ గా రికార్డులోకెక్కాడు. ఈ రికార్డును అతను 53 ఇన్నింగ్స్ ల్లో సాధించి.. సచిన్ రికార్డును బ్రేక్ చేసాడు. సచిన్ 55 ఇన్నింగ్స్ ల్లో భారతగడ్డ మీద 3000 పరుగులు సాధించాడు.


కోహ్లీ కూడా తక్కువేం కాదు.. అతను కూడా టెస్ట్ మ్యాచుల్లో 19 సెంచరీలు పూర్తిచేసాడు. ఈ రికార్డును అతను 104 ఇన్నింగ్స్ ల్లో సాధించి సచిన్ రికార్డును దాటేశాడు. సచిన్ 105 ఇన్నింగ్స్ ల్లో 19 సెంచరీలు చేసాడు.