MS Dhoni: టీ20 ప్రపంచక‌ప్‌(T20 World Cup 2021)లో టీమిండియాకు మెంటర్‌(Mentor)గా ఎమ్మెస్ ధోనిని నియ‌మించ‌డంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌(BCCI Apex Council)కు ఫిర్యాదు అందింది. లోధా క‌మిటీ సిఫార్సుల(Lodha Committee Reforms) ప్రకారం ధోని నియామకం ప‌రస్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల క్లాజ్‌ ఉల్లంఘన 38(4) కిందికి వస్తుందని మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్రికెట్ అసోసియేష‌న్ మాజీ స‌భ్యుడు సంజీవ్ గుప్తా(Sanjeev Gupta) ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆయన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ(Sourav Ganguly), కార్యదర్శి జై షా సహా అపెక్స్ కౌన్సిల్‌ సభ్యులకు లేఖ రాశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోధా క‌మిటీ సిఫార్సుల మేరకు ఓ వ్య‌క్తి రెండు ప‌ద‌వులు ఎలా నిర్వహిస్తాడన్న విషయంపై సంజీవ్ గుప్తా స్పష్టత కోరారు. అయితే, దీనిపై అపెక్స్ కౌన్సిల్ త‌మ లీగ‌ల్ టీమ్‌ను సంప్ర‌దించాల్సి ఉందని బీసీసీఐ(BCCI) వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇదిలా ఉంటే, ధోని(MS Dhoni) ఇప్ప‌టికే బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్‌(IPL)లో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అతను టీమిండియాకు మెంటర్‌గా కూడా ఎంపిక కావడంతో వివాదం మొదలైంది.  కాగా, సంజీవ్‌ గుప్తా గ‌తంలో కూడా ఆటగాళ్లపై ఇలాంటి ప‌రస్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల ఫిర్యాదులు చాలా చేశాడు. 


Also Read: Team india for T20 world cup: టీ20 వరల్డ్ కప్‌కి వెళ్లే భారత జట్టు ఇదే.. shikhar dhawan తప్పని నిరాశ


సౌరభ్‌ గంగూలీ స్పందిస్తూ.. రెండు ఐసీసీ ప్రపంచకప్‌లు గెలిచిన మాజీ కెప్టెన్‌ ధోని అనుభవం టీమిండియాకు కలిసి వస్తోందనే ఉద్దేశంతోనే మెంటార్‌గా నియమించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు సారథ్యం వహించిన విషయం తెలిసిందే. 


బుధవారం టీ20 ప్రపంచకప్‌ జట్టు ప్రకటన సందర్భంగా.. ధోనిని టీమిండియాకు మెంటార్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా(Jay Shaw) ప్రకటించిన విషయం తెలిసిందే. భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన నాయకుడిగా చరిత్ర సృష్టించిన ధోనిని మెంటార్‌గా నియమించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోని రికార్దు నెలకొల్పాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook