India Need To Win 161 Runs: నేపియర్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. కాన్వే, ఫిలిప్స్ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు చేస్తుందని అనుకున్నా.. చివర్లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ జోరుకు కళ్లెం పడింది. దీంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, మహ్మాద్ సిరాజ్ చెరో నాలుగు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు. 161 లక్ష్యంతో భారతో బరిలోకి దిగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు రాగా.. భారత బౌలర్లు మొదట్లో నిప్పులు చెరిగారు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ (3) ఎల్బీడబ్యూ అయ్యాడు. 5.2 ఓవర్లకు 44 పరుగులతో కాస్త కుదురుకున్నట్లే కనిపించినా.. మహ్మద్ సిరాజ్ ఈసారి దెబ్బ తీశాడు.  మార్క్ చాప్‌మన్‌ (12) అర్ష్‌దీప్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ కాన్వే క్రీజ్‌లో పాతుకుపోగా.. గ్లెన్ ఫిలిప్స్ తోడయ్యాడు.


ఇద్దరు ఆచితూచి ఆడుతూనే.. మధ్యమధ్యలో బౌండరీలతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. దీంతో 13వ ఓవర్లలోనే స్కోరు బోర్డు వంద పరుగులు దాటింది. ఈ క్రమంలోనే డెవాన్ కాన్వే 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఫిలిప్స్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. ఇద్దరు క్రీజ్‌లో కుదురుకోవడంతో కివీస్ భారీ స్కోరు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరికి తక్కువ స్కోరుకే పరిమితమైంది. 


అయితే 15.5 ఓవర్లలో 130 పరుగులకు చేరుకోగా.. ఫిలిప్స్ (54) సిరాజ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తరువాత కాన్వే (59)ను అర్షదీప్ పెవిలియన్‌కు పంపించగా.. నీషమ్ (0), శాంట్నర్ (1)లను సిరాజ్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. టెయిలిండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది.


Also Read: Satyendra Jain Massage: మంత్రికి మసాజ్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్.. ఆ వీడియోలో కీలక మలుపు


Also Read: 7th Pay Commission: కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిపుల్ బొనంజా.. కీలక నిర్ణయాల దిశగా కేంద్రం..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి