7th Pay Commission: కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిపుల్ బొనంజా.. కీలక నిర్ణయాల దిశగా కేంద్రం..!

7th Pay Commission Latest News: కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. 2023 సంవత్సరంలో వారి జీతంలో భారీ పెరుగుదల ఉండబోతోంది. వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2022, 09:06 PM IST
  • వచ్చే ఏడాదిలో కేంద్రం కీలక నిర్ణయాలు
  • ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు గ్రీన్‌ సిగ్నల్..?
  • మళ్లీ పాత పెన్షన్ విధానం అమలు
7th Pay Commission: కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిపుల్ బొనంజా.. కీలక నిర్ణయాల దిశగా కేంద్రం..!

7th Pay Commission Latest News: నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుసగా శుభవార్తలను అందిస్తోంది. 2023లో కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగులకు పెరిగిన డీఏ వర్తించేలా ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో ఉద్యోగులు డిమాండ చేస్తున్న డిమాండ్స్‌ను నెరవేర్చేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వచ్చేలో ఏడాదిలో నిర్ణయం తీసుకోవచ్చు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రభుత్వం గిఫ్ట్‌గా ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), పాత పెన్షన్ స్కీమ్‌పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎప్పుడు పెరుగుతుంది..?

కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నడూ లేనివిధంగా అతిపెద్ద గిఫ్ట్ పొందవచ్చు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, ప్రమోషన్ తర్వాత.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా వచ్చే ఏడాది పొందే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచితే.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద కనీస వేతనం రూ.18 వేలు లభిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2023న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తర్వాత కేంద్ర ఉద్యోగుల ఈ డిమాండ్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. 

డీఏ మళ్లీ పెరుగుతుంది

కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ (డీఏ)ను ప్రతి 6 నెలలకోసారి సమీక్షిస్తారు. ఏఐసీపీఐ డేటా ఆధారంగా.. డియర్‌నెస్ అలవెన్స్ సంవత్సరానికి రెండుసార్లు పెంచుతారు. ఈ పెంపు జనవరి, జూలైలో ఉంటుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే 2023లో కూడా కేంద్ర ఉద్యోగుల డీఏలో పెరుగుదల ఉంటుంది. జనవరి 2023కి సంబంధించిన డీఏను మార్చిలోపు కేంద్రం ప్రకటిస్తుంది. ఇప్పటివరకు ఉన్న ద్రవ్యోల్బణం గణాంకాలను పరిశీలిస్తే.. వచ్చే ఏడాది కూడా 4 శాతం డీఏ పెంపు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే.. అక్టోబరు, నవంబర్, డిసెంబర్‌ల ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఇంకా రాలేదు.

కానుకగా పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనం..

వచ్చే ఏడాది కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం పాత పెన్షన్‌ను పెద్ద కానుకగా ఇవ్వనుంది. 2023లో పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయవచ్చు. పాత పింఛన్‌ను అమలు చేయాలని ఉద్యోగుల నుంచి చాలా కాలంగా డిమాండ్‌ వస్తోంది. ఎన్నికల వాగ్దానాలకు కట్టుబడి కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్‌ను కూడా అమలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలె పంజాబ్ కేబినెట్ కూడా పాత పెన్షన్ విధానానికి ఆమోదించింది. పాత పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి అభిప్రాయాన్ని కోరింది. 7వ వేతన సంఘం కింద  2024 సంవత్సరానికి కంటే ముందే ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది.

Also Read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు.. భారీగా పెరగనున్న జీతాలు..!

Also Read: DA Hike For Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతం.. లెక్కలు ఇలా..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News