ముంబైకి చెందిన ఓ క్రికెటర్ ఆత్మహత్య (Mumbai Cricketer Commits suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది. లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి కారణాలతో మ్యాచ్‌లన్నీ రద్దు చేశారు. దీంతో కెరీర్ మీద బెంగతో కరణ్ తివారీ(27) మలాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్య (Cricketer Commits suicide) చేసుకున్నాడు. చనిపోయే ముందు తన కెరీర్ గురించి షేర్ చేసుకోవడానికి రాజస్థాన్‌లో ఉన్న ఓ స్నేహితుడికి కాల్ చేశాడు. అతడు కరణ్ తివారి కుటుంబాన్ని అలర్ట్ చేశాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. వెళ్లి చూసిన కుటుంబసభ్యులకు ఈ యువ క్రికెటర్ శవమై కనిపించాడు. Virat Kohli: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కోహ్లీ.. కానీ ఓ కండీషన్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబైలో సీనియర్ టీమ్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడు. కెరీర్ గురించి ఎప్పుడూ ఆలోచించేవాడని తివారి స్నేహితుడు, నటుడు జితువర్మ తెలిపాడు. మంచి లోకల్ క్లబ్‌లో చోటు కోసం కష్టపడేవాడని ముంబై సీనియర్ టీమ్ కోచ్ వినయక్ శమంత్ అన్నారు. ముంబై రంజీ టీమ్, ఐపీఎల్ టీమ్‌లకు కరణ్ తివారి నెట్‌లో బౌలింగ్ వేసేవాడు. MS Dhoni ఆ విషయాన్ని ముందే చెప్పాడు: యువరాజ్ సింగ్


అసలేం జరిగింది..
గత కొన్ని నెలలుగా మ్యాచ్‌లు జరగడం లేదు. కెరీర్‌కు బ్రేక్ రాలేదని ఆందోళన చెందాడు. ఆరోజు రాత్రి డిన్నర్ తర్వాత గదికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రాజస్థాన్‌లో ఉన్న ఓ స్నేహితుడికి ఫోన్ చేసి తన బాధను చెప్పాడు. బతకాలని లేదని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తివారి మాటల్ని రాజస్థాన్‌లో ఉంటున్న అతడి సోదరికి క్రికెట్ స్నేహితుడు చెప్పాడు. ఆమె తన తల్లి, సోదరుడికి కాల్ చేసి అలర్ట్ చేసింది. వారు గదికి వెళ్లి డోర్ కొడితే తెరవలేదు. తలుపులు బద్ధలుకొట్టి చూడగా కరణ్ తివారి విగతజీవిగా కనిపించాడు. సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. 
Sara Ali Khan Birthday Special: సారా అలీ ఖాన్ బర్త్‌డే స్పెషల్ గ్యాలరీ 
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 
RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు