టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) చెన్నై పోలీసులను ఆశ్రయించాడు. చెన్నైకి చెందిన ఓ వ్యాపారికి అప్పు ఇవ్వగా ఎగ్గొట్టినట్లు గురువారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా జి.మహేష్ అనే వ్యాపారి పరిచయమం అయ్యాడని, అతడు తన వద్ద నమ్మకంగా వ్యవహరించి రూ.4కోట్ల మేర అప్పు తీసుకున్నాడని తన ఫిర్యాదులో భజ్జీ పేర్కొన్నాడు. Vadivel Balaji Dies: కమెడియన్ వడివేల్ బాలాజీ మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నిసార్లు అడిగినా లాభం లేకపోయిందని వాపోయాడు. గత ఆగస్టులో రూ.25 లక్షల చెక్కు ఇచ్చాడని, కానీ అది బౌన్స్ అయిందని బౌలర్ హర్భజన్ పోలీసులకు వివరించాడు. మహేష్‌ వద్ద నుంచి తనకు రావాల్సిన నగదు ఇప్పించాల్సిందిగా చెన్నై పోలీసులను కోరాడు. మరోవైపు వ్యాపారవేత్త మహేష్ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. Rishabh Pant: ధోనీని ఫాలో కావొద్దు.. రిషభ్ పంత్‌కు ఎమ్మెస్కే ప్రసాద్ వార్నింగ్


కాగా, ప్రస్తుతం ఐపీఎల్ 2020 (IPL 2020) ఆడేందుకు యూఏఈకి వెళ్లిన హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగొచ్చేశాడు. భజ్జీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మనసు మార్చుకుంటే భజ్జీ ఏ క్షణంలోనైనా ఐపీఎల్ ఆడేందుకు యూఏఈ వెళ్లే అవకాశాలున్నాయి. Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR