CSK IPL Schedule 2024: ఐపీఎల్ హంగామా షురూ అయింది. క్రికెట్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్-17వ సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది బీసీసీఐ. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  ప్రస్తుతం 15 రోజుల షెడ్యూల్‌ (21 మ్యాచ్‌లు) ను మాత్రమే ప్రకటించింది. తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో కప్ ను మరోసారి ఎగరేసుకుపోవాలని ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు భావిస్తోంది. ఈసారి వేలంలో న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్రను కొనుగోలు చేసింది సీఎస్కే. శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులో చేరాడు. చెన్నై జట్టు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు, వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు తదితర వివరాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నై జట్టు షెడ్యూల్ ఇలా: 
==> CSK vs RCB చెన్నైలో మార్చి 22 - 7:30 pm 
==> CSK vs GT చెన్నైలో మార్చి 26- 7:30 pm  
==> DC vs CSK మార్చి 31న విశాఖపట్నంలో - 7:30 pm  
==> SRH vs CSK ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో - 7:30 pm 


రిటైన్ చేసిన ఆటగాళ్లు: MS ధోని, మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరత్రాణ, మతీషా పతిరానా సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ.


వేలంలో కొనుగోలు చేసిన క్రికెటర్లు: రచిన్ రవీంద్ర (రూ. 1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు), డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు), సమీర్ రిజ్వీ (రూ. 8.40 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ. 2 కోటి), అవనీష్ రావు ఆరవెల్లి (రూ. 20 లక్షలు).



చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరానా, అజింక్య రహాన్, శైక్య రహాన్, మిచెల్ సాంట్నర్, సిమర్‌జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి.


Also Read: IPL 2024 schedule: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్‌సీబీ ఢీ..!


Also Read: IPL 2024 Updates: గుజరాత్ టైటాన్స్ కు భారీ షాక్.. ఐపీఎల్ నుంచి షమీ ఔట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter