IPL 2024 Full Schedule: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22న చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా టోర్నీ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ ఢీకొట్టనుంది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం పాక్షిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొదటి 17 రోజులు (మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు) 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పాక్షిక షెడ్యూల్ రిలీజ్ చేసింది బీసీసీఐ. ఎన్నికల తేదీల ఆధారంగా మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు వైజాగ్ వేదికగా తమ హోమ్ గేమ్‌లలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
Also Read: PM Kisan Samman Nidhi Yojana: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు ఆ రోజే ఖాతాల్లోకి..
🚨 𝗦𝗧𝗢𝗣 𝗧𝗛𝗘 𝗣𝗥𝗘𝗦𝗦 - TATA #IPL2024 Schedule is HERE! 🤩
Get ready for the thrill, excitement and fun to begin! Save this post so you don't have to search for it again 🔍
It's #CSKvRCB, @msdhoni 🆚 @imVkohli in the opener! Who's your pick ? 👀#IPLSchedule #IPLonStar pic.twitter.com/oNLx116Uzi
— Star Sports (@StarSportsIndia) February 22, 2024
పూర్తి షెడ్యూల్ ఇలా..
==> CSK vs RCB చెన్నైలో మార్చి 22 - 7:30 pm
==> PBKS vs DC మొహాలీలో మార్చి 23 - 3:30 pm
==> KKR vs SRH కోల్‌కతాలో మార్చి 23 - 7:30 pm
==> RR vs LSG జైపూర్‌లో మార్చి 24 - 3:30 pm
==> GT vs MI అహ్మదాబాద్‌లో మార్చి 24 - 7:30 pm
==> RCB vs PBKS బెంగళూరులో మార్చి 25- 7:30 pm
==> CSK vs GT చెన్నైలో మార్చి 26- 7:30 pm
==> SRH vs MI మార్చి 27న హైదరాబాద్‌లో - 7:30 pm
==> RR vs DC మార్చి 28న జైపూర్‌లో - 7:30 pm
==> RCB vs KKR మార్చి 29న బెంగళూరులో - 7:30 pm
==> LSG vs PBKS మార్చి 30న లక్నోలో - 7:30 pm
==> GT vs SRH మార్చి 31న అహ్మదాబాద్‌లో - 3:30 pm
==> DC vs CSK మార్చి 31న విశాఖపట్నంలో - 7:30 pm
==> MI vs RR ఏప్రిల్ 1న ముంబైలో - 7:30 pm
==> RCB vs LSG ఏప్రిల్ 2న బెంగళూరులో - 7:30 pm
==> DC vs KKR ఏప్రిల్ 3న విశాఖపట్నంలో - 7:30 pm
==> GT vs PBKS ఏప్రిల్ 4న అహ్మదాబాద్‌లో - 7:30 pm
==> SRH vs CSK ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో - 7:30 pm
==> RR vs RCB ఏప్రిల్ 6న జైపూర్‌లో - 7:30 pm
==> MI vs DC ఏప్రిల్ 7న ముంబైలో - 3:30 pm
==> LSG vs GT ఏప్రిల్ 7న లక్నోలో - 7:30 pm
Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్, ధర పరంగా ఇదే బెస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter