Dwayne Bravo: ఐపీఎల్ 2020 నుంచి డ్వేన్ బ్రావో ఔట్
Dwayne Bravo Ruled Out from IPL 2020 | చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీఎస్కే స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నుంచి వైదొలిగాడని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. మిగతా మ్యాచ్‌లకు డ్వేన్ బ్రావో అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీఎస్కే స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నుంచి వైదొలిగాడని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. జాతీయ మీడియా ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ఐపీఎల్ 2020లో లీగ్ దశలో మరో 4 మ్యాచ్‌లు ఉండగా.. సీఎస్కే ఘనంగా ముగించాలని భావించిందని చెప్పారు. కానీ కీలక ఆటగాడు డ్వేన్ బ్రావో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు.
గాయం కారణంగా బాధపడుతున్న డ్వేన్ బ్రావో త్వరగా కోలుకునే అవకాశాలు కనిపించడం లేదన్నారు. దీంతో ఐపీఎల్ 2020 నుంచి మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నాడని, ఏ క్షణంలోనైనా అతడు వెస్టిండీస్‌కు బయలుదేరనున్నాడని చెప్పారు. ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన జట్లలో సీఎస్కే ఒకటి అని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రస్తుత సీజన్‌లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని అంతగా రాణించలేకపోయిందని పేర్కొన్నారు.
ఇదివరకే కీలక ఆటగాడు సురేష్ రైనాతో పాటు స్పిన్నర్ హర్భజన్ సింగ్ లాంటి ఆటగాళ్లు ఐపీఎల్ 2020లో జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు బ్రావో గాయంతో దూరమయ్యాడు. సీఎస్కే జట్టుకు రైనా, భజ్జీలాంటి ఆటగాళ్ల గైర్హాజరు మైనస్ అయిందన్నారు. కానీ ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నాడు. సీనియర్లు, జూనియర్లు అనే వ్యత్యాసం లేకుండా.. అందరూ క్రికెటర్లు తమ ఫ్రాంచైజీకి సమానమేనని తాజా వదంతులకు చెక్ పెట్టారు.
Also Read: MS Dhoni In IPL 2020: ఎంఎస్ ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు.. చెక్కు చెదరదు
డ్వేన్ బ్రావో దూరం కావడంతో అతడి స్థానాన్ని ఇకనైనా ఇమ్రాన్ తాహీర్‌తో భర్తీ చేయనున్నామని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. ఐపీఎల్ 2019లో అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సాధించిన ఇమ్రాన్ తాహీర్ ఇప్పుడు తమ బెస్ట్ ఆప్షన్ అని ఆయన అభిప్రాయపడ్డారు. పీయూష్ చావ్లా, కరణ్ శర్మలు అంతగా రాణించలేదని, జడేజా సైతం బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేదని గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe