KL Rahul: పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరిచిపోయాడు.. Video వైరల్

KXIP vs DC Match in IPL 2020 | మంగళవారం రాత్రి పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ చెప్పడం మరచిపోయాడు. 

Last Updated : Oct 21, 2020, 09:21 AM IST
  • ఐపీఎల్ 2020లో వరుస విజయాలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు దూసుకెళ్తోంది
  • ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన కేఎల్ రాహుల్ సేన
  • అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు సరదా సన్నివేశం.. నెట్టింట వీడియో వైరల్
KL Rahul: పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరిచిపోయాడు.. Video వైరల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో తొలి 7 మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్‌లో నెగ్గి ఇక ఇంటిదారి పట్టడమే తరువాయి అనేలా కనిపించిన జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab). అయితే విధ్వంసక ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ అనారోగ్యం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వరుస విజయాలతో పంజాబ్ దూసుకెళ్తోంది. అయితే మంగళవారం రాత్రి పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో మ్యాచ్ సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది.

 

నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) టాస్ చెప్పడం మరచిపోయాడు. సాధారణంగా హోమ్ కెప్టెన్ టాస్ నిర్ణయం వెల్లడించాలి. టాస్ నెగ్గిన కెప్టెన్ తమ ఎంపికను తెలియజేయాలి. అయితే ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా తీవ్ర ఒత్తిడికి గురైన కేఎల్ రాహుల్.. టాస్ వేశాక తన నిర్ణయాన్ని చెప్పడం మరిచిపోయాడు. ఆపై రెండోసారి టాస్ వేయాల్సి వచ్చింది. ఇందులో టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేఎల్ రాహుల్ టాస్ చెప్పడం మరిచిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

కాగా, పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గేల్ వచ్చిన ఉత్సాహం జట్టులో కనిపిస్తుంది. గేల్ జట్టుతో చేరిన తర్వాత పంజాబ్ 3 మ్యాచ్‌లాడగా అన్నింట్లోనూ విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయాలతో పంజాబ్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. దీంతో సీఎస్కే, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల ప్లే ఆఫ్ అవకాశాలను ప్రబావితం చేస్తోంది.  Also Read: MS Dhoni In IPL 2020: ఎంఎస్ ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు.. చెక్కు చెదరదు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News