మరో నాలుగు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19న జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో టైటిల్ ఫెవరెట్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. కానీ సీఎస్కే జట్టును కరోనా కష్టాలు ఇంకా వీడటం లేదు. ఓవైపు రెండు వారాలు కరోనా కారణంగా ప్రాక్టీస్ చేయలేదు. అంతలోనే కీలక ఆటగాళ్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఐపీఎల్ షురూ చేయకుండానే వ్యక్తిగత కారణాలంటూ భారత్‌కు తిరిగొచ్చేశారు. Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జట్టులో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికీ కరోనాతో బాధపడుతున్నాడు. రెండు వారాల తర్వాత కూడా పాజిటివ్ లక్షణాలు తేలుతున్నాయి. రైనా లేని లోటుతో ఉన్న జట్టుకు రుతురాజ్ కోలుకోకపోవడం ఇబ్బంది పెడుతోంది. దీపక్ చాహర్, సీఎస్కే సిబ్బంది మాత్రమే కోలుకున్నారు. జట్టు అవసరాల కోసం టాపార్డర్, మిడిలార్డర్‌లో రుతురాజ్ అవసరం చెన్నైకి ఎంతైనా ఉంది. ప్రస్తుతం అతడు ఇంకా క్వారంటైన్‌లో ఉన్నాడు. కోలుకున్నాక సైతం వెంటనే మైదానంలో కనిపిస్తాడని చెప్పలేం. జట్టులో మార్పులు చేసుకునేందుకు చెన్నై తంటాలు పడుతోంది. Bigg Boss 4: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్‌ ఓటింగ్ నెంబర్స్ ఇవే...


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR