ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్: చెన్నై జట్టు టైటిల్ గెలవాలంటే సాధించాల్సిన లక్ష్యం ?
ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్: చెన్నై జట్టు టైటిల్ గెలవాలంటే సాధించాల్సిన లక్ష్యం ?
హైదరాబాద్: ఐపిల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు తీసి 149 పరుగులకు పరిమితం అయ్యేలా చేసింది. టాస్ గెలిచిన ముంబై జట్టు కెప్టేన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్‌కే మొగ్గుచూపాడు. అలా ముంబై ఇండియన్స్ జట్టు తరపున క్రీజులోకి వచ్చిన ఓపెనర్లు క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ తొలి 5 ఓవర్లలోనే 45 పరుగులకు ఒకరి వెంట మరొకరుగా ఇద్దరూ ఔట్ అయ్యారు. ఆ తర్వాత 11వ ఓవర్‌లో ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో 15 పరుగులకే సూర్య కుమార్ ఔట్ అయ్యాడు. అనంతరం 12వ ఓవర్‌లోనే కృనాల్ రూపంలో మరో వికెట్ కోల్పోయింది ఆ జట్టు. అలా 4 వికెట్లు కోల్పోయిన తర్వాత ముంబై జట్టు సాధించిన మొత్తం స్కోర్ 90 పరుగులు. ఆ తర్వాత 15 ఓవర్లో ఇషాన్ కిషన్ 23 వ్యక్తిగత పరుగుల వద్ద తాహిర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ బాట పట్టాడు. ఇన్నింగ్స్ చివర్లో 18వ ఓవర్‌లో హర్థిక్ పాండ్య, రాహుల్ చాహర్(0), 19వ ఓవర్‌లో మెక్ క్లెనగన్(0) వరుసగా ఔట్ అయ్యారు. దీంతో 149 పరుగులకు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది.
150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ స్కోర్‌ని సాధిస్తే కానీ ఐపిఎల్ 2019 సీజన్ టైటిల్ ఆ జట్టు సొంతం కాలేదు.