Amit Mishra reveals why MS Dhoni bite his bat before going to bat: బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి రావడానికి ముందు ఒక్కో బ్యాటర్‌కు ఒక్కో అలావాటు ఉంటుంది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజాలు చాలా కూల్‌గా ఉంటారు.. సౌరవ్ గంగూలీ అయితే గోళ్లు కొరుకుతూ ఉంటాడు.. వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్ అయితే షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అలానే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాట్‌ కోరుకుతుంటాడు. ఇలా ఎందుకు చేస్తుంటాడో తెలుసుకొవాలనుందా?. అయితే ఈ కింద మ్యాటర్ చదవండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియాకు ఆడిన సమయంలో క్రీజులోకి రావడానికి ముందు ఎంఎస్ ధోనీ చాలా సందర్భాల్లో తన బ్యాట్‌ను కొరికి పరిశీలించేవాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా మహీ అప్పుడప్పుడూ తన బ్యాట్‌ను కోరిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. తాజాగా ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా మహీ బ్యాట్ కొరుకుతూ కనిపించాడు. ఇందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇంతకీ ధోనీ అలా చేయడానికి గల అసలు కారణాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్‌ మిశ్రా వెల్లడించాడు.


ఎంఎస్ ధోనీ బ్యాట్‌ ఎందుకు కోరుకుతాడని మీరు ఆశ్చర్యపోతున్నారా?. మరేమీ లేదు.. మహీ తన బ్యాట్ శుభ్రంగా ఉండడానికి ఇష్టపడుతారు.  తన బ్యాట్‌పై ఏదైనా టేప్‌ ఉంటే దానిని తొలగించడానికే నోటితో కొరుకుతుంటాడు. ప్రతీసారి బ్యాటింగ్‌కు వెళ్లడానికి ముందు బ్యాట్‌పై ఎలాంటి టేప్‌ లేదా థ్రెడ్‌ ఉండనీయడు. మీరు ఎప్పుడైనా మహీ బ్యాటును పరిశీలిస్తే ఎలాంటి టేప్‌ కానీ, థ్రెడ్‌ కానీ కనిపించవు' అని అమిత్‌ మిశ్రా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.



ఐపీఎల్ 2022లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెలరేగుతున్న విషయం తెలిసిందే. క్రీజులోకి రావడమే ఆలస్యం బౌండరీల మోత మోగిస్తూ పరుగులు చేస్తున్నాడు. 15వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన ధోనీ.. ఆ తర్వాత అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు. ఢిల్లీపై ఇన్నింగ్స్‌ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన మహీ.. 8 బంతుల్లో​ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 21 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022లో 11 మ్యాచులు ఆడిన ధోనీ.. 163 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో చెలరేగుతూ తనలోని ఫినిషర్ ఇంకా అలానే ఉన్నాడని చాటిచెప్పాడు. 


Also Read: ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. పెళ్లయిన 36 రోజులకే! విష ప్రయోగం విఫలం కాగా.. రెండోసారి పక్కా స్కెచ్


Also Read: Geetha Arts: గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా సునీత ధర్నా.. కారణం ఇదే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook