DC vs CSK match live score updates: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేడు జరగనున్న ఐపిఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ రిషబ్ పంత్ చెన్నైపై బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (Chennai Super Kings) ఈ మ్యాచ్‌లో గెలిచి తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తోంది. అందుకోసం ధోనీ సేన గట్టిగానే ప్రిపేర్ అయింది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి వేదికైన స్టేడియమే నేటి మ్యాచ్‌కి కూడా వేదిక కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, ఐపిఎల్ చరిత్రలో 100 మ్యాచ్‌లు గెలిచిన రికార్డుకు మరో అడుగు దూరంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై (Chennai Super Kings) గెలిచి ఆ రికార్డును అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే చివరి రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ తడబడిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్ల (Delhi Capitals) వికెట్లు టపటపా పడ్డాయి. 


కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (Kolkata Knight Riders) మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ కసితోనే ముంబై ఇండియన్స్‌పై తిరగబడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 4 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్స్‌పై గెలుపును సొంతం చేసుకుంది.


Also read : KKR vs SRH match Highlights: కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి అట్టడుగుకు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్


చెన్నై జట్టుకు అవసరం వచ్చినప్పుడు ఆదుకోవడానికి రుతురాజ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయీన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) లాంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఢిల్లీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఆడిన చివరి మూడు మ్యాచుల్లో శిఖర్ ధావన్ (Shikhar Dhawan) వరుసగా 85, 101 నాటౌట్, 35 పరుగులు సాధించాడు. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు కూడా ఉండనే ఉన్నారు. ఇలాంటి బలాలు, బలహీనతల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎవరిది పై చేయి అవుతుందో తెలియాలంటే.. ఢిల్లీ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య మ్యాచ్ ( DC vs CSK match live updates) ఫలితం తేలాల్సిందే.


Also read : RR vs CSK: చెన్నైపై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం..యశస్వీ, దూబే విధ్వంసం..రుతురాజ్‌ సెంచరీ వృథా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook