DC vs MI: ఐపీఎల్లో బోణీ కొట్టిన ఢిల్లీ... నాలుగు వికెట్ల తేడాతో ముంబైపై ఘన విజయం...
IPL Live Updates DC vs MI: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.
IPL Live Updates DC vs MI: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ మొదట తడబడింది. ముంబై నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో 104 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఢిల్లీ చేజారినట్లే కనిపించింది. కానీ చివరలో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ అద్భుత భాగస్వామ్యంతో ఢిల్లీ విజయం సాధించింది.
ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్ మంచి శుభారంభమే అందించారు. ఇద్దరూ ధాటిగా ఆడుతున్న క్రమంలో 3.3 ఓవర్‌లో తొలి వికెట్‌గా టిమ్ సీఫెర్ట్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో బంతికే మన్‌దీప్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఒకే ఓవర్లో ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్ ఔట్ అవడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. కెప్టెన్ రిషబ్ పంత్ ఆదుకుంటాడని భావించినప్పటికీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మిల్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు.
ఆ వెంటనే పృథ్వీ షా, పావెల్, శార్దూల్ వికెట్లు కూడా వెంట వెంటనే కోల్పోయింది. లలిత్ యాదవ్ 38 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 48 పరుగులు, అక్షర్ పటేల్ కేవలం 17 బంతుల్లోనే మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 38 పరుగులు చేసి ఢిల్లీని విజయ తీరాలకు చేర్చారు.ముంబై బౌలర్లలో బసిల్ థంపి 3 వికెట్లు, మురుగన్ అశ్విన్ 2 వికెట్లు, మిల్స్ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాంత్ కిషన్ ముంబైకి శుభారంభం అందించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 81 పరుగులు చేసి ముంబై బ్యాట్స్‌మెన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Also Read: KGF 2 Trailer: కేజీఎఫ్ 2 ట్రైలర్ విడుదల.. 'రక్తంతో రాసిన కథ ఇది'
Also read: Pooja Hegde: టైట్‌ఫిట్ అథ్లెటిక్ డ్రెస్‌తో మెరుస్తున్న రాధేశ్యామ్ హీరోయిన్ పూజా హెగ్డే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook