IPL Live Updates DC vs MI: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాంత్ కిషన్ ముంబైకి శుభారంభం అందించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 81 పరుగులు చేసి ముంబై బ్యాట్స్‌మెన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో రెండు సిక్స్‌లు, 11 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ 32 బంతుల్లో 2 సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 41 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో తిలక్ వర్మ (22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ సాధించాడు. హిట్టర్ కీరన్ పొలార్డ్ కేవలం 3 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశారు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో ఢిల్లీ సక్సెస్ అయింది. పృథ్వీ షా, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్‌, పావెల్‌లతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ముంబై నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ చేధిస్తుందా లేదా చూడాలి.


Also Read: 'ఆర్ఆర్ఆర్‌'లో ఎన్టీఆర్ నటనకు థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న మహిళ...


Also Read: CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook