David Warner Record: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు!
DC vs SRH, IPL 2022: David Warner Surpasses Chris Gayle. టీ20 క్రికెట్‌లో అత్యధిక అర్థ సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు.
David Warner hits most half centuries in T20I cricket, Surpasses Chris Gayle: గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 92 నాటౌట్, 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోవ్‌మన్ పావెల్ (35 బంతుల్లో 67 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 స్కోరుకే పరిమితమైంది. నికోలస్ పూరన్ (34 బంతుల్లో 62, 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), ఐడెన్ మార్‌క్రామ్ (25 బంతుల్లో 42, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.
ఈ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెలరేగి ఆడిన వార్నర్ 58 బంతుల్లో 92 రన్స్ చేశాడు. ఈ హాఫ్ సెంచరీ వార్నర్‌కు 89వది. దాంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక అర్థ సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు. నిన్నటివరకు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (88)తో సమానంగా ఉన్న వార్నర్.. తాజాగా అతడిని అధిగమించాడు. క్రిస్ గేల్ ఈ మధ్య ఎక్కువగా మ్యాచులు ఆడడం లేదు కాబట్టి వార్నర్‌ను ఇప్పట్లో అధిగమించే అవకాశం ఏ బ్యాటర్‌కీ లేదు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక అర్థ సెంచరీలు బాదిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ పొట్టి క్రికెట్‌లో 77 హాఫ్ సెంచరీలు బాదాడు. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ 70 అర్థ సెంచరీలతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ 69 హాఫ్ సెంచరీలతో ఐదో స్థానంలో ఉన్నాడు. టాప్ 5 జాబితాలో ఇద్దరు ఆస్ట్రేలియా, భారత్ ఆటగాళ్లే ఉండడం విశేషం.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ మరో రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో ఐడెన్ మార్‌క్రామ్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన వార్నర్.. టీ20 క్రికెట్‌లో 400వ సిక్సర్‌ను పూర్తి చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విండీస్ హిట్టర్ క్రిస్ గేల్ పేరుపై ఉంది. యూనివర్సల్ బాస్ 1056 సిక్సర్లు బాది ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. కీరన్ పోలార్డ్ (764) రెండో స్థానంలో ఉన్నాడు. గేల్‌ను అందుకోవాలంటే ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.