Umran Malik Fastest Delivery: తాజా ఐపీఎల్ సీజన్‌లో జమ్మూ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. ఇదివరకు చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో 154 కి.మీ వేగంతో విసిరిన ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును తాజాగా బ్రేక్ చేశాడు. గురువారం (మే 5) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 157 కి.మీ వేగంతో తాజా ఐపీఎల్ సీజన్‌లో అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీని సంధించాడు.
ఢిల్లీతో మ్యాచ్‌లో చివరి 20వ ఓవర్‌లో ఉమ్రాన్ మాలిక్ వరుసగా 156 కి.మీ, 157 కి.మీ వేగంతో బంతులు విసిరాడు. అయితే ఉమ్రాన్ బుల్లెట్ స్పీడ్‌తో విసిరిన బంతులు ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌కు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఉమ్రాన్ వేసిన 4 ఓవర్లలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ 52 పరుగులు పిండుకున్నారు. పవర్ ప్లేలో ఉమ్రాన్ వేసిన ఓవర్‌లో డేవిడ్ వార్నర్ ఓ రేంజ్‌లో చెలరేగాడు. ఒకే ఓవర్‌లో 21 పరుగులు రాబట్టాడు.
గతంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో ధోనీకి 154 కి.మీ వేగంతో ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ డెలివరీని సంధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ అనంతరం ఉమ్రాన్ మాట్లాడుతూ... అంతకుమించిన ఫాస్టెస్ట్ డెలివరీస్ సంధించే సత్తా తనలో ఉందని చెప్పుకొచ్చాడు. చెప్పినట్లుగానే తాజా ఢిల్లీ మ్యాచ్‌లో అంతకన్నా వేగంతో బంతులు విసిరాడు. ఉమ్రాన్ మాలిక్ బంతులను చూసి... అవి బంతులా... బుల్లెట్లా అని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఐపీఎల్‌లో సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున ఉమ్రాన్ మాలిక్ విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు తీశాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో 25 పరుగులకే 5 వికెట్లు తీసి ఐపీఎల్‌లో కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు.
Also Read: SRH vs DC: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి, ఢిల్లీ చేతిలో 21 పరుగుల తేడాతో పరాజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.