David Warner viral video: ఢిల్లీ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ (David Warner) అభిమానులను అలరించడంలో ముందుంటాడు, అది ఆటతోనైనా లేదా చేష్టలతోనైనా. తెలుగు ఫ్యాన్స్ కు డేవిడ్ వార్నర్‌ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. గతంలో డేవిడ్ బాయ్ సన్ రైజర్స్ కెప్టెన్ గా వ్యవహారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీకి ఆడుతున్న వార్నర్ ఈ సీజన్ లో భారీ ఇన్నింగ్స్ లు ఆడింది ఏమీ లేదు. అతడు ఏడు మ్యాచులుఆడి 167 రన్స్ మాత్రమే చేశాడు. రీసెంట్ గా దర్శకధీరుడు రాజమౌళితో వార్నర్ చేసిన యాడ్ నెట్టింట నవ్వులు పూయించింది. ఇది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా వార్నర్ కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో వార్నర్ ఉచిత ఆధార్‌ కార్డు (Aadhar Card) కోసం పరుగులు తీస్తూ కనిపించాడు. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో హోస్ట్‌తో వార్నర్‌ కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా హోస్ట్ వార్నర్ కు పలు ప్రశ్నలు సంధిస్తాడు. తొలుత సినిమాకు వెళ్దామని హోస్ట్‌.. వార్నర్‌ను అడగ్గా అతడు రాలేనని జవాబిస్తాడు. ఉచిత భోజనం చెప్పనా అని అడగ్గా వద్దంటాడు. చివరకు అక్కడ ఆధార్‌ కార్డు ఫ్రీ ఇస్తున్నారని చెప్పగా.. వార్నర్ వెంటనే హోస్ట్ ను ఎత్తుకుని పరుగులు తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా విపరీతంగా నవ్వులు పూయిస్తుంది. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇవాళ గుజరాత్‌ టైటాన్స్‌ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో వార్నర్ లేకుండా బరిలోకి దిగుతోంది. 


ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(w/c), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్త్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్(c), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్



Also Read: T20 World Cup 2024: 'టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. కార్తీక్, రాహుల్‌కు నో ఛాన్స్'


Also Read: T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి