IPL 2024-Delhi Capitals: మరో వారం రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ మెుదలుకానుంది. ఎడిషన్ కు ప్రారంభం కాకముందే కీలక ఆటగాళ్లు దూరమవుతున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకోగా.. ఈసారి స్టార్ పేసర్, సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి ఐపీఎల్ నుంచి వైదొలిగినట్లు శుక్రవారం (మార్చి 15) ఐపీఎల్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. గాయం కారణంగా అతడు దూరమైనట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంగిడి లేకపోవడం ఢిల్లీ జట్టుకు పెద్ద దెబ్బేనని చెప్పాలి, గతంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ సాధించడంలో ఇతడు కీ రోల్ పోషించాడు. 2022 సీజన్ నుంచి ఢిల్లీకి ఆడుతున్నాడు. ఇప్పటి వరకు మెుత్తంగా 14 మ్యాచులు ఆడిన ఎంగిడీ 25 వికెట్లు తీశాడు భారీ యాక్సిడెంట్ తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన రిషబ్ పంత్ ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహారించనున్నాడు. చాలా కాలంపాటు క్రికెట్ కు దూరంగా ఉన్న పంత్ జట్టును ఎలా నడుపుతాడో చూడాలి. 


ఇక ఎంగిడి స్థానంలో ఆసీస్ యువ ఆల్ రౌండర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌ను జట్టులో తీసుకుంది ఢిల్లీ. ఇతను తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్నాడు. ఇతడి ఎంపిక కాస్త ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఫాస్ట్ బౌలర్ ప్లేస్ లో ఆల్ రౌండర్ తీసుకోవడం పట్ల ఢిల్లీ స్ట్రాటజీ ఏంటో అర్థం కావడం లేదు. ప్రేజర్ ఆస్ట్రేలియా తరపున రెండు వన్డే మ్యాచులు మాత్రమే ఆడాడు. ఇప్పటి వరకు టీ20 ఆరంగ్రేటమే చేయలేదు. అయితే బిగ్ బాష్ లీగ్ లో ఆడిన అనుభవం ఇక్కడ అక్కరకు వస్తుంది. ఇతడిని రూ.50 లక్షలకే కొనుగోలు చేసింది ఢిల్లీ. గత సీజన్ లో ఢిల్లీ తొమ్మిదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 


పంత్ పునారాగమనం చేయడం ఢిల్లీకి కలిసి వస్తుందనే చెప్పాలి. అతడు 2016 నుండి ఢిల్లీకి ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 98 మ్యాచ్‌లలో 34.61 సగటుతో రేట్‌తో 2,838 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. 


Also read: Praveen Kumar: హార్ధిక్ ఏమైనా చంద్ర మండలం మీద నుంచి ఊడిపడ్డాడా?.. బీసీసీఐను కడిగిపారేసిన టీమిండియా మాజీ పేసర్..


Also read: Ranji Trophy 2024 winner: రంజీల్లో తిరుగులేని ముంబై.. 42వ సారి టైటిల్ కైవసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి