IND vs ENG 5th Test: ధర్మశాలలో దంచుతున్న టీమిండియా బ్యాటర్లు.. రోహిత్, గిల్ సెంచరీలు..
India vs England: ధర్మశాలలో టీమిండియా బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. టీ20 తరహాలో బౌండరీలు, సిక్సర్సతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్, గిల్ సెంచరీలు బాదారు.
Dharmashala Test live Score: ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ, యువ కెరటం శుభ్‌మన్ గిల్ సెంచరీల మోత మోగించారు. లంచ్ సమయానికి వికెట్ కోల్పోయి 264 పరుగులు చేసిన టీమిండియా.. ఆ తర్వాత రోహిత్ 103(13 ఫోర్లు, 3 సిక్సర్లు), గిల్ 110 (12 ఫోర్లు, 5 సిక్సర్లు) వికెట్లను కోల్పోయింది. రోహిత్ ను స్టోక్స్, గిల్ ను అండర్సన్ ఔట్ చేశారు. తాజా సెంచరీతో హిట్‌మ్యాన్ సిరీస్‌లో రెండోది, మొత్తంగా 12వ శతకం నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ 64 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. డెబ్యూ ప్లేయర్ పడిక్కల్, సర్పరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం రోహిత్ సేన 68 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఓవర్‌నైట్ స్కోర్ 135/1తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ కు భారీ స్కోరు అందించారు రోహిత్, గిల్. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ముఖ్యంగా బషీర్‌ను లక్ష్యంగా చేసుకొని బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే వీరు సెంచరీరీలు పూర్తి చేశారు. తొలి రోజు ఆటలో కుర్ర హిట్టర్ యశస్వి హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్పినర్లు ధాటికి ఇంగ్లండ్ జట్టు 218 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా తన మణికట్టు మాయాజలంతో స్టోక్స్ సేన భరతం పట్టాడు కుల్దీప్. ఇతడికి అశ్విన్ కూడా తోడవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ త్వరగా ముగిసింది. కుల్దీప్ ఐదు వికెట్లు, అశ్విన్ నాలుగు వికెట్లు తీశారు. ఇది అశ్విన్ కు వందో టెస్టు కావడం విశేషం. ఈ సిరీస్ లో ఇప్పటికే టీమిండియా 3-1తో లీడింగ్ లో ఉంది.
Also Read: Rohit Sharma: హిట్‌మ్యానా మజాకా... ఒకే రోజు మూడు రికార్డులు కొల్లగొట్టిన రోహిత్..
Also Read: IND vs ENG: ఇంగ్లండ్ ను కుప్పకూల్చిన కుల్దీప్, అశ్విన్.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన యశస్వి, రోహిత్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook