Rishabh Pant hilarious reaction goes viral after Dinesh Karthik bowls: అంతర్జాతీయ క్రికెట్‌లో సాధారణంగా వికెట్ కీపర్‌లు బౌలింగ్ చేయరు. ఆడమ్ గిల్‌క్రిస్ట్, రాహుల్ ద్రవిడ్, మార్క్ బౌచర్, కుమార్ సంగక్కర, ఆండీ ఫ్లవర్, అలెక్ స్టీవర్ట్, బ్రాడ్ హాడిన్, మాట్ ప్రియర్, బ్రెండన్ మెకల్లమ్ లాంటి కీపర్‌లు బౌలింగ్ చేసిన దాఖలు లేవు. అయితే ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ లాంటి కొందరు కీపర్‌లు సరదాగా బౌలింగ్ చేశారు. తాజాగా టీమిండియా కీపర్ దినేష్ కార్తీక్ బౌలింగ్ చేశాడు. 18 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దుబాయ్‌ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 102 పరుగుల భారీ తేడాతో ఘన విజయ సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (122 నాటౌట్‌; 61 బంతుల్లో 12×4, 6×6) చేయడంతో భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 222 పరుగులు చేసింది. అనంతరం భువనేశ్వర్‌ కుమార్ (5/4) బౌలింగ్‌లో చెలరేగడంతో అఫ్గాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. అఫ్గాన్‌తో అప్పటికే భారత విజయం లాంఛనమవడంతో.. కెప్టెన్ కేఎల్ రాహుల్ సరదాగా దినేష్ కార్తీక్ చేతికి బంతిని ఇచ్చాడు. స్పిన్ బౌలింగ్ వేసిన డీకే.. 18 పరుగులు సమర్పించుకున్నాడు. 



దినేష్ కార్తీక్‌ మొదటి బంతిని హాఫ్ పిచ్ మీద సంధించడంతో.. ఆఫ్గానిస్తాన్‌ బ్యాటర్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడాడు. ఆ బంతిని దీపక్ చహర్ బౌండరీ వెళ్లకుండా అడ్డుకున్నాడు. అయితే బ్యాటర్ షాట్ ఆడే ప్రయత్నంలో తన బ్యాటును వదిలేశాడు. ఆపై కీపర్ రిషబ్ పంత్.. డీకే వైపు చూస్తూ ఇదేం బౌలింగ్ సామీ అన్నట్టు సైగలు చేశాడు. ఇది చాలా ఫన్నీగా ఉంది. డీకే బౌలింగ్‌ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు డీకేపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 'బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదుగా.. అందుకే బౌలింగ్ ఇచ్చారు' అని పేర్కొంటున్నారు. 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో డీకే బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. ఆసియా కప్ 2022లో మూడు మ్యాచులు ఆడిన డీకే.. ఒకే ఒక్క బంతిని ఎదుర్కొన్నాడు.  



Also Read: Amala Paul Hot Pics: ఓనమ్ స్పెషల్.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న అమలా పాల్!


 


Also Read: పండగపూట కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్.. స్లీవ్ లెస్ జాకెట్, వైట్ శారీలో అచ్చు అప్సరలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook