Amala Paul Hot Pics: ఓనమ్ స్పెషల్.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న అమలా పాల్!

Amala Paul Latest Onam 2022 Pictures goes viral. ఓనమ్ పండగ సందర్భంగా అమలా పాల్ తెల్లటి శారీలో ఏంజెల్‌లా మెరిసిపోతున్నారు. అమ్మడి ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 
 

1 /7

ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తూ.. అందాలతో అదరగొడుతున్నారు అమలా పాల్‌. ఓనమ్ పండగ సందర్భంగా అమలా తెల్లటి శారీలో ఏంజెల్‌లా మెరిసిపోతున్నారు. అమ్మడి ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.   

2 /7

ఎందుకో తెలియదు కానీ అమలా పాల్‌కు తెలుగులో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు అయితే రాలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మ త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌కు వెళ్లిపోయారు. అమలా వెబ్ ​సిరీస్​లలో కూడా నటిస్తున్నారు.   

3 /7

తెలుగులో ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, మేము, ఆమె సినిమాలతో అమలా పాల్‌ సత్తాచాటారు. రఘువరన్ బీటెక్​, వీఐపీ వంటి హిట్​ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.   

4 /7

'మైనా' (తెలుగులో ప్రేమ ఖైదీ) చిత్రం ఘన విజయం సాధించడంతో అమలా పాల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక నాయక్ సినిమాతో అమలా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.   

5 /7

తమిళ హాస్యచిత్రం 'వికడకవి'లో ఒక పాత్రను పోషించినా.. ఈ సినిమా విడుదల బాగా ఆలస్యం అయింది. ఈ మధ్యలో వీర శేకరన్, సింధు సామవేళి అనే తమిళ చిత్రాలలో నటించారు. సింధు సామవేళిలో ఈమె పోషించిన సుందరి పాత్రతో బాగా ఫేమస్ అయ్యారు.   

6 /7

విద్యాభ్యాసాన్ని కోచిలో పూర్తిచేసిన అమలా పాల్.. ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ తెరకెక్కించిన 'నీల తామర' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారు.   

7 /7

1991 అక్టోబరు 26న అమలా పాల్ జన్మించారు. కేరళలోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. అమలా పాల్ అసలు పేరు అనఖ.   

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x