Sri Lanka Trolls: ఇప్పుడు చేయండ్రా అబ్బాయిలు నాగిని డాన్స్.. శ్రీలంక జట్టుపై పేలుతున్న జోకులు!
Fans trolls Sri Lanka Team after defeat by Namibia. నమీబియా చేతిలో ఓడిన శ్రీలంక జట్టును సోషల్ మీడియాలో ఫాన్స్ టార్గెట్ చేశారు. ఇప్పుడు చేయండ్రా అబ్బాయిలు నాగిని డాన్స్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
Fans trolls Sri Lanka Team after defeat by Namibia in T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 తొలి రోజే పెను సంచలనం నమోదైన విషయం తెలిసిందే. సూపర్ 12లో చోటు కోసం జరుగుతున్న రౌండ్-1 మ్యాచులో మాజీ ఛాంపియన్ శ్రీలంకకు పసికూన నమీబియా షాకిచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచులో నమీబియా ఏకంగా 55 పరుగుల తేడాతో గెలుపొందింది. జాన్ ఫ్రైలింక్ (44; 28 బంతుల్లో 4×4, 2/26) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆసియా కప్ 2022 ఛాంపియన్ అయిన లంక ఇలా ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
నమీబియాపై పరాజయంతో శ్రీలంక సూపర్ 12 అవకాశాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 55 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో నెట్ రన్‌రేట్ పైనా తీవ్ర ప్రభావం చూపింది. నెదర్లాండ్స్, యూఏఈ కూడా ఉన్న గ్రూప్-ఎ నుంచి సూపర్ 12కు అర్హత సాధించాలంటే శ్రీలంక మిగతా రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. గెలిచినా కూడా మిగతా మ్యాచ్‌ల ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి గ్రూప్ నుంచి నమీబియా రేసులో ఉంది. మిగతా ఒక్క మ్యాచ్ గెలిచినా నమీబియా సూపర్ 12కు అర్హత సాధిస్తుంది.
పసికూన నమీబియా చేతిలో ఓడిన శ్రీలంక జట్టును ఫాన్స్ టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున లంక జట్టును ట్రోల్ చేస్తున్నారు. ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంక.. నెల రోజులు కూడా తిరగకముందే పసికూన చేతిలో ఓడడం దారుణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆసియా కప్ 2022 గెలవగానే లంక ప్లేయర్స్ చేసిన నాగిని డాన్సులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ట్రోల్ చేశారు. 'ఇప్పుడు చేయండ్రా అబ్బాయిలు నాగిని డాన్సులు' అని పేర్కొన్నారు. శ్రీలంక హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఫోటోను పెట్టి.. 'రాత్రి మీ అందరికీ బెల్ట్ ట్రీట్మెంట్ ఉంది' అని మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.
Also Read: Sitrang Cyclone: 'సిత్రాంగ్' వచ్చేస్తుంది.. మరికొన్ని రోజులు భారీ వర్షాలు తప్పవు!
Also Read: ప్రపంచకప్‌లో ఏ బౌలర్లు ఆడతారో నాకు తెలుసు.. వారికి ఆత్మవిశ్వాసం ఇవ్వడం ముఖ్యం: రోహిత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook