Sitrang Cyclone: 'సిత్రాంగ్' వచ్చేస్తుంది.. మరికొన్ని రోజులు భారీ వర్షాలు తప్పవు!

Cyclone Sitrang will hits AP and Telangana. తెలుగు రాష్ట్రాలకు సిత్రాంగ్ తుఫాను ముప్పు ఉందని తాజాగా వాతావరణ శాఖ చెప్పింది. సిత్రాంగ్ ప్రభావంతో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 17, 2022, 10:32 AM IST
  • సిత్రాంగ్ వచ్చేస్తుంది
  • మరికొన్ని రోజులు భారీ వర్షాలు తప్పవు
  • గతంలో వర్షాలు కురిసినప్పటికీ
Sitrang Cyclone: 'సిత్రాంగ్' వచ్చేస్తుంది.. మరికొన్ని రోజులు భారీ వర్షాలు తప్పవు!

Cyclone Sitrang will hits AP and Telangana: గత మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు వాగులు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు అయితే నిత్యం వరద నీటిలో చిక్కికుపోతున్నాయి. గతంలో వర్షాలు కురిసినప్పటికీ.. నిరంతరంగా ఎప్పుడూ కురవలేదు. దాంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షాలతో అల్లాడుతుండగా.. రానున్న రోజుల్లో మరిన్ని భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు ఉందని తాజాగా వాతావరణ శాఖ చెప్పింది. మంగళవారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందట. దాంతో అక్టోబర్ 20 నాటికి అది తీవ్ర వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి 'సిత్రాంగ్' అని పేరు పెట్టారు. సిత్రాంగ్ అంటే థాయ్ భాషలో 'వదలని' అని అర్ధం. సిత్రాంగ్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీగా వర్షాలు కురువనున్నాయట. 

మరోవైపు నవంబరులో ఏర్పడే వాయుగుండాలు తుపానుగా బలపడేందుకు అవకాశముందని విశాఖకు చెందిన వాతావరణ నిపుణుడు మురళీ కృష్ణ పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే కొద్ది రోజుల పాటు రాష్ట్ర మంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. 'అక్టోబరులో నైరుతి రుతుపవనాల తిరోగమనంలో అల్పపీడనాలు ఏర్పడడం సాధారణం. ప్రస్తుతం ఒకదాని తరువాత మరొకటి ఏర్పడుతున్నాయి. అందుకే ఎన్నడూ లేని విధంగా ఈసారి అధికంగా వర్షాలు పడుతున్నాయి. గతంలో వర్షాలు కురిసినప్పటికీ.. ఇలా  నిరంతరంగా ఎప్పుడూ కురవలేదు. మరికొన్ని రోజులపాటు ఈ తరహా వర్షాలు ఉంటాయి' అని అన్నారు. 

Also Read: ప్రపంచకప్‌లో ఏ బౌలర్లు ఆడతారో నాకు తెలుసు.. వారికి ఆత్మవిశ్వాసం ఇవ్వడం ముఖ్యం: రోహిత్

Also Read: Nandamuri Balakrishna - Unstoppable : అలా ట్రై చేసినవన్నీ పోయాయట.. దటీజ్ బాలయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News