T20 World Cup 2022, IND vs AUS Warm-up Match: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత్ సన్నాహకం మొదలైంది. భారత్ అఫీషియల్ వార్మప్ మ్యాచ్‌ను నేడు ఆడబోతోంది. మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న ఆస్ట్రేలియాను నేడు రోహిత్ సేన ఎదుర్కొనబోతోంది. బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్ది సేపట్లో వార్మప్ మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా భారత్ బ్యాటింగ్ చేయనుంది.
కరోనా నుంచి కోలుకొని వచ్చిన మొహ్మద్ షమీకి తుది జట్టులో స్థానం కల్పించలేదు. అయితే ప్రాక్టీస్ సందర్భంగా మధ్యలో కొన్ని ఓవర్లు వేసే అవకాశం ఉంది. షమీతో పాటు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను బౌలర్లుగా వినియోగించుకొనున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. మరోవైపు రిషబ్ పంత్ బదులుగా దినేష్ కార్తీక్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
బుధవారం న్యూజిలాండ్‌తో మరో వార్మప్ మ్యాచ్ భారత్ ఆడాల్సి ఉంది. మెగా సమరానికి ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. దాంతో ఫిట్‌నెస్, ఫామ్‌ను పరీక్షించుకోవడానికి భారత్ మంచి అవకాశం దొరికింది. అలానే ఆసీస్ పిచ్‌లపై అలవాటు పడేందుకు సమయం కూడా దొరుకుతుంది.
టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'ముందుగా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలనుకోలేదు. మేము ముందుగానే ఆసీస్ వచ్చి పెర్త్‌లో ప్రాక్టీస్ చేశాం. ఈ రెండు గేమ్‌లు బాగా ఉపయోగపడుతాయి. రెండు గేమ్‌లలో కొన్ని ప్రయోగాలు చేయాలనుకుంటున్నాము. ప్రపంచకప్‌లో ఏ బౌలర్లు ఆడతారో నా మనసుకు తెలుసు. వారికి ఆత్మవిశ్వాసం ఇవ్వడం ముఖ్యం. కొందరికి ఇదే మొదటి ఆస్ట్రేలియా పర్యటన. క్రికెట్ ఆడటానికి మరియు పరిస్థితులను నేర్చుకుంటూ ఆనందించడానికి ఆసీస్ ఒక అద్భుతమైన ప్రదేశం. ఐసీసీ టోర్నమెంట్‌లో కెప్టెన్‌గా చేయడం ఇదే మొదటిసారి. నేను దీన్ని ఆస్వాదించడానికి చూస్తాను' అని అన్నాడు.
Also Read: Kantara vs Godfather : కాంతారా దెబ్బకు గాడ్ ఫాదర్ గూటికి
Also Read: Janhvi Kapoor Pics : బిగించేసిన జాన్వీ కపూర్.. అందాల అల్లకల్లోలం.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook