ENG Vs PAK Highlights: పాపం పాకిస్థాన్.. ఓటమితో వరల్డ్ కప్ నుంచి ఇంటిముఖం.. ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విక్టరీ
England Vs Pakistan Match Report: ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగానే.. క్రికెట్ అభిమానులు అందరూ పాపం పాకిస్థాన్ అనుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసి ఉంటే.. సెమీస్‌లో చోటు కాస్త పోరాడేది. పాక్ ఛేజింగ్ చేయాల్సి రావడంతో మ్యాచ్‌పై అందరికీ ఆసక్తిపోయింది. ఇంగ్లాండ్ చేతిలో 93 పరుగుల తేడాతో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది.
England Vs Pakistan Match Report: వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ ప్రస్థానం ఓటమితో ముగిసింది. శనివారం ఇంగ్లాండ్ చేతిలో 93 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. ఈ టోర్నీలో మూడో విజయాన్ని అందుకుంది. టాస్ ఓటమితోనే పాక్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 337 పరుగుల చేసింది. అనంతరం పాకిస్థాన్ జట్టు 43.3 ఓవర్లలో కేవలం 244 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్థాన్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 విజయలు 8 పాయింట్లతో ఐదోస్థానంతో టోర్నీ నుంచి తప్పుకుంది. ఇంగ్లాండ్ జట్టు 3 విజయాలు ఆరు పాయింట్లో ఏడో స్థానంలో నిలిచింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అర్హత సాధించింది.
ఇంగ్లాండ్ విధించిన 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి పాక్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెరీర్‌లో చివరి వన్డే ఆడుతున్న డేవిడ్ విల్లీ చెలరేగి బౌలింగ్ చేశాడు. అబ్దుల్లా షఫీక్‌ను డకౌట్ చేయగా.. ఫఖర్ జమాన్ ఒక్క పరుగుకే పెవిలియన్‌కు పంపించాడు. 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. ఆ తరువాత కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. భారీ స్కోర్లు చేయలేకపోయారు. 45 బంతుల్లో 38 పరుగులు చేసి బాబర్ అజామ్ ఔట్ అవ్వగా.. మహ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 36 రన్స్ చేసి డగౌట్ చేరుకున్నారు. దీంతో 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయం చేసుకుంది.
ఆఘా సల్మాన్ (45 బంతుల్లో 51, 6 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా.. సాద్ షకీల్ (37 బంతుల్లో 29, 4 ఫోర్లు), హారిస్ రవూఫ్ (23 బంతుల్లో 35, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), షాహీన్ అఫ్రిది (23 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇప్తికార్ అహ్మద్ (3), షాదాబ్ ఖాన్ (4) విఫలమయ్యారు. చివరికి 244 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, ఆట్కిసన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (76 బంతుల్లో 84, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జో రూట్ (72 బంతుల్లో 60, 4 ఫోర్లు), జానీ బెయిర్ స్టో (61 బంతుల్లో 59, 7 ఫోర్లు, ఒక సిక్స్) ఇంగ్లాండ్ భారీ స్కోరుకు బాటలు పరిచారు. డేవిడ్ మలన్ (31), జోస్ బట్లర్ (27), హ్యారీ బ్రూక్ (30) దూకుడుగా ఆడారు. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్‌కు మూడు వికెట్లు దక్కగా.. షాహీన్ అఫ్రిది , మహ్మద్ వసీమ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇప్తికార్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది. డేవిడ్ విల్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook