ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడు అయిన జానీ బెయిర్‌స్టో (Johnny Bairstow)కు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లాండ్ తరఫున వన్డేలు, టీ20లు, టెస్టులు అన్ని ఫార్మాట్లో అవకాశాలు అంది పుచ్చుకోవాలని ఆశించిన బెయిర్‌స్టోకు ఇంగ్లాండ్ క్రికెట్ సెలక్టర్ల నిర్ణయంతో భారీగా నష్టపోనున్నాడు. వచ్చే ఏడాదికి ప్రకటించిన ఇంగ్లాండ్ టెస్టు ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాలో బెయిర్‌స్టోకు చోటు దక్కలేదు. దీంతో రూ.6.5 కోట్ల మేర ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కోల్పోనున్నాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బెయిర్‌స్టో ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో 3 స్థానాలు మెరుగు పరుచుకుని టాప్ 10లో నిలిచాడు. దీంతో అతడు రెగ్యూలర్ టెస్టు జట్టులో చోటు దక్కుతుందని భావించాడు. కానీ ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ మాత్రం అతడికి కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో చోటిచ్చింది. 



కాగా, ఓలీ పోప్, జాక్ క్రాలే, సిబ్లేలకు వచ్చే ఏడాదికిగానూ టెస్టు కాంట్రాక్ట్ లభించింది. నిలకడగా ఫలితాలు రాబట్టే వికెట్ కీపర్ బ్యాట్ప్‌మన్ జానీ బెయిర్‌స్టోకు ఈ అవకాశం చేజారడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే అందివచ్చిన అవకాశాలతో తానేంతో నిరూపించుకునే బెయిర్‌స్టో అటు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కీలకంగా మారాడు. ఓపెనర్‌గా సైతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.  



 


మరిన్ని కథనాలు మీకోసం



 




 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe