విరాట్ కోహ్లీతో ఓపెనింగ్ చేయనున్న దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్.. ఇక పరుగుల వరదే!!
Predicted Opening Pair Of RCB: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్‌లు గతంలో ఆర్‌సీబీ తరఫున ఆడిన ఓ ఫొటోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో కోఈ ఇద్దరు ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని చెప్పకనే చెప్పింది.
Faf du Plessis to Open RCB Innings with Virat Kohli in IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022కు సమయం దగ్గరపడుతోంది. మార్చి 26న ఆరంభం కానున్న మెగా లీగ్ మే 29 వరకు కొనసాగనుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు సీజన్లు యూఏఈలో జరగ్గా.. ఈసారి మాత్రం భారత్ వేదికగానే జరగనుంది. త్వరలోనే పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. ఈసారి రెండు కొత్త జట్లు వచ్చిన నేపథ్యంలో ఇటీవల మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. దాంతో అన్ని జట్లలోని ఆటగాళ్లు మారిపోయారు. ఐపీఎల్ టోర్నీలో ఈసారి కొత్త కాంబినేషన్లను మనం చూడొచ్చు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టులో ఈసారి టాప్ ఆర్డర్‌లో మార్పులు అనివార్యం అయ్యాయి.
ఆర్‌సీబీ మెగా వేలం 2022కి ముందు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్‌వెల్, టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌లను మాత్రమే అట్టిపెట్టుకోగా.. మిగతా వారిని వేలంలోనే కొనుగోలు చేసింది. అయితే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్‌ని రూ.7 కోట్ల ధర వెచ్చించి కొనుగోలు చేసింది. మిగతా జట్లతో పోటీపడి మరీ కైవసం చేసుకుంది. అందుకు కారణం లేకపోలేదు. టాప్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీకి తోడుగా అతడిని బరిలోకి దింపనుంది. ఇదే విషయాన్ని ఆర్‌సీబీ తన ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పింది.
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్‌లు గతంలో ఆర్‌సీబీ తరఫున ఆడిన ఓ ఫొటోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'భవిష్యత్‌కు సంబంధించిన ఫొటో ఇది. ఈ ఇద్దరు స్టార్లు కలిసి బరిలోకి దిగితే చూడాలని ఉంది' అని ఆర్‌సీబీ కాప్షన్ ఇచ్చింది. దీంతో కోహ్లీ, ఫాఫ్ కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 'కోహ్లీతో ఓపెనింగ్ చేయనున్న డుప్లెసిస్', 'కోహ్లీకి జోడీ దొరికింది' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఫాఫ్ డుప్లెసిస్‌కు జతగా యువ ఓపెనర్ అనూజ్ రావత్‌ను ఆడిస్తారని మొనటివరకు ప్రచారం జరిగినా.. ఆర్‌సీబీ తాజా ట్వీట్‌తో విరాట్ కోహ్లీనే ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడనే విషయం స్పష్టం అయింది. ఫాఫ్ ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ (635) తర్వాత టోర్నీలో అత్యధిక పరుగులు (633) చేసిన ఆటగాడిగా నిలిచాడు. హాఫ్ సెంచరీలతో అలరిస్తూ చెన్నై టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఈసారి అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: ButterFly Teaser: నీ కళ్లను, మెదడును అస్సలు నమ్మకు.. ఆకట్టుకుంటున్న అనుపమ 'బటర్ ఫ్లై' టీజర్!!
Also Read: IPL 2022: అభిమానులకు గుడ్ న్యూస్.. నేరుగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు! కానీ ఓ కండిషన్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook