ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో కోహ్లిసేన ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ టార్గెట్ చేస్తూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. హాఫ్ సెంచరీ చేసిన ధోనీని విమర్శించడమేంటని ఆశ్చర్యపోతున్నారా ? అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెస్టు తరహా ఆటతో బేజారు


ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ వన్డేలో ఆసీస్ పై భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఒకవైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కి టీమిండియా పరువుకాపాడాడు. ఈ సందర్భంలో రంగంలోకి దిగిన ధోనీ  ... రోహిత్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాయాడు. ఈ క్రమంలో వ్యక్తిగత 51 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అయితే ఈ పరుగుల సాధించడానికి ధోనీకి 96 బంతులు తీసుకున్నాడు. దీంతో టార్గెట్ రన్ రేట్ పెరుగుతూ చివరి బ్యాట్స్ మెన్లపై ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో చివరి వికెట్ల టపటప రాలిపోయాయి. అంతిమంగా 50 ఓవర్లు పూర్తయ్యే సరిసరికి 9 వికెట్ల కోల్పోయి 254 పరుగుల మాత్రమే టీమిండియా చేయగల్లింది. ఈ నేపథ్యంలో ధోనీ టెస్టు తరహా ఆడిన తీరుపై టీమిండియా అభిమానులు మండి పడుతున్నారు.  సోషల్ మీడియా వేదికగా విమర్శలు సంధిస్తున్నారు..


ధోనీపై వచ్చిన ట్వీట్ ఇవే...
 ధోనీ వన్డేలకి పనికి రాడు.. టెస్టులకి పనికొస్తాడంటూ.. సెటైర్లు
‘‘ధోనీ ఔట్ అయ్యాడు.. ఇప్పుడు మనకు గెలిచే అవకాశం ఉంది’’ 
‘‘రిషబ్ పంత్ వన్డేలు.. ధోనీ టెస్ట్‌లు ఆడాలి.. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరుగుతోంది’’


ధోనీకి బాసటగా నిలిచిన మరికొందరు
ఇలా ధోనీని టార్గెట్ చేస్తూ ఎవరికి తోచిన రీతిలో వారు స్పందిస్తున్నారు. అయితే మరోవైపు ధోనీకి కొందరు అభిమానులు మద్దతు పలికారు. డకౌట్లు..సింగిల్ డిజిట్ కే ఔటైన వారిని వదిలేసి ధోనీని టార్గెట్ చేయడమేంటని పలువురు అభిమానులు ప్రశ్రిస్తున్నారు