ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) రికార్డులకు వేదిక అవుతోంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ కెఎల్ రాహుల్ రెచ్చిపోయి ఆడాడు. అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒకే ఓవర్‌లో 24 పరుగులు కొట్టిన రాహుల్... 14 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. తద్వారా గతంలో ఐపీఎల్‌లో యూసుఫ్ పఠాన్ నెలకొల్పిన 15 బంతుల్లో అర్థ సెంచరీ రికార్డుని తిరగరాశాడు.


2017లో సునీల్ నరైన్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో (15బంతుల్లో అర్థం సెంచరీ), 2014లో సురేశ్ రైనా పంజాబ్‌తో మ్యాచ్‌లో(16 బంతుల్లో అర్థ సెంచరీ ) చేసి  ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకాలు సాధించిన వారి లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్ రికార్డుల్లో చూసుకుంటే తాజాగా రాహుల్ చేసిన అర్థ సెంచరీ..మూడవ అత్యధిక అర్థశతకంగా నిలిచింది. 2007లో ఇంగ్లాండ్‌పై  యువరాజ్‌సింగ్ 12 బంతుల్లో ఈ ఘనత అందుకున్న సంగతి తెలిసిందే.