FIFA Awards 2023 LIVE Streaming: ప్రపంచ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ FIFA (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్) సోమవారం అంటే ఈరోజు ఫిబ్రవరి 27 రాత్రి పారిస్‌లో మెరిసే వేడుకలో FIFA బెస్ట్ మేల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022 విజేతను ప్రకటించనుంది. ఈ నెల మొదట్లో ప్రకటించిన షార్ట్‌లిస్ట్‌ల ప్రకారం, 2022లో అర్జెంటీనాను వారి మూడవ FIFA ప్రపంచ కప్ టైటిల్‌ వరకు తీసుకువెళ్లిన లెజెండరీ లియోనెల్ మెస్సీ, పారిస్ సెయింట్-జర్మైన్ F.C.సహచరుడు, ఫ్రాన్స్‌కు చెందిన కైలియన్ ఎంబప్పే సహా రియల్ మాడ్రిడ్ స్ట్రైకర్ కరీమ్ బెంజెమా ఈ అవార్డులను గెలుచుకునే రేసులో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక గత సంవత్సరం ఖతార్‌లో జరిగిన ఫైనల్‌లో ఫ్రాన్స్‌కు చెందిన కైలియన్ ఎంబప్పేని ఓడించి, టోర్నమెంట్‌లో ఏడు గోల్స్ చేసి, తన రెండవ గోల్డెన్ బాల్‌ను సాధించడం ద్వారా అర్జెంటీనాను వారి మూడవ ప్రపంచ కప్ టైటిల్‌కు నడిపించిన మెస్సీ తన రెండవ ' ది బెస్ట్' ట్రోఫీని గెలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రపంచ కప్ గోల్డెన్ బూట్ విజేత ఎంబప్పే, అలాగే ఫ్రాన్స్ కు చెందిన 2022 బలూన్ d'Or విజేత బెంజెమా మొదటిసారిగా ముగ్గురు ఫైనలిస్టులలో ఒకడిగా ఉన్నారు.  


స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ అలెక్సియా పుటెల్లాస్ మోకాలి గాయంతో జూలై నుండి జట్టుకు దూరమైనప్పటికీ వరుసగా రెండవ సంవత్సరం ఉత్తమ మహిళా క్రీడాకారిణి అవార్డును అందుకునే అవకాశం అయితే ఉంది. టోర్నమెంట్‌లో లీడింగ్ స్కోరర్, బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఇంగ్లండ్‌ను యూరో 2022 టైటిల్‌ వరకు తీసుకు వెళ్లిన తరువాత ఫార్వర్డ్ బెత్ మీడ్ కూడా నామినేట్ చేయబడింది. 2019లో ఫైనలిస్ట్‌గా ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఫార్వర్డ్ అలెక్స్ మోర్గాన్ కూడా ఈ లిస్టులో ఉంది 


ఇక 'ది బెస్ట్' FIFA అవార్డ్స్ 2022 వేడుక ఎప్పుడు, ఎక్కడ జరుగుతోంది? 
'ది బెస్ట్' FIFA అవార్డ్స్ 2022 వేడుక ఫిబ్రవరి 27, 2023న పారిస్‌లోని థియేటర్ డు చాట్‌లెట్‌లో జరుగుతుంది.
'ది బెస్ట్' FIFA అవార్డ్స్ 2022 వేడుక ఏ సమయంలో ప్రారంభమవుతుంది? 
'ది బెస్ట్' FIFA అవార్డ్స్ 2022 వేడుక సోమవారం (ఫిబ్రవరి 27) రాత్రి 1.30AM ISTకి 9 PM CEST/8PM GMTకి ప్రారంభమవుతుంది. 
'ది బెస్ట్' FIFA అవార్డ్స్ 2022 వేడుకను మీరు ఎలా చూడగలరు? 
'ది బెస్ట్' FIFA అవార్డ్స్ 2022 వేడుకను FIFA యొక్క అధికారిక వెబ్‌సైట్, యాప్ ద్వారా ఆ;ఏజ్ FIFA YouTube ఛానెల్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. 
Also Read: IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు.. అరుదైన రికార్డుపై కన్నేసిన ఆర్ అశ్విన్‌!


Also Read: Womens T20 World Cup: మహిళా టీ20 ప్రపంచకప్ విజేతగా ఆసీస్.. ప్రైజ్‌మనీ ఎంత గెలుచుకుందో తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి